Corona Patients : ప్రస్తుతం దేశంలో కరోనా విలయతాండవం చేస్తుంది. రోజు రోజుకు పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. కరోనా బాధితుల దారణ సంఘటనలను వింటున్నాం నేరుగా చూస్తున్నాం. ప్రతిరోజు చాలా వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు కరోనా బాధితులకు సంబంధించిన వీడియో కొత్తగా వెలుగులోకి వచ్చింది. ఇది ప్రజలను కదిలించింది. ఎందుకంటే ఈ వీడియోలో కరోనా రోగులు చెట్లకింద చికిత్స పొందుతున్నారు. దీనికి సంబంధించి అనేక రకాల ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి.
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని అగర్ మాల్వా జిల్లాలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ వీడియోలో కరోనా బాధితులు రోడ్డు పక్కన ఉన్న చెట్లకింద చికిత్స పొందుతున్నారు. ఒక వరుస క్రమంలో పడుకొని గ్లూకోజ్ బాటిల్స్ చెట్ల కొమ్మలకు తగిలించి కనిపిస్తుంది.
వీడియో చూసిన తర్వాత మీ గుండె తరుక్కుపోతుంది. ట్విట్టర్‌లో ఈ వీడియోను ‘విజయ్ కేడియా’ అనే యూజర్ షేర్ చేశాడు. ఈ వీడియోను షేర్ చేస్తున్నప్పుడు ఆయన ఈ విధంగా రాశారు. ‘ఈ వైరల్ వీడియో మధ్యప్రదేశ్ లోని అగర్ మాల్వా జిల్లాకు చెందినది. నారింజ తోటలో చికిత్స పొందుతున్న కరోనా రోగులు’ అంటూ తెలిపాడు. దాదాపు రెండు వేల మంది ఈ వీడియోను చూశారు ప్రతి ఒక్కరు కామెంట్స్, షేర్ చేస్తున్నారు.
यह #वायरल #विडीयो है,#मध्यप्रदेश के आगर मालवा जिले का। संतरे के बगीचे मे संदिग्ध #कोरोना मरीजों का हो रहा इलाज! झोलाछाप #डाक्टर पेड़ों के सहारे चढ़ा रहे स्लाईन। प्रशासन ने कार्यवाही की।@jyotiyadaav @upmita @capt_ivane @VTankha @ipskabra @shooterdadi @AshokShrivasta6 pic.twitter.com/DUXLUSmtmu
— Vijay Kedia (@TheVijayKedia) May 5, 2021