Bharat Bandh: కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలపై కార్మిక సంఘాల ఆగ్రహం.. ఈనెల 28,29 తేదీల్లో దేశవ్యాప్త సమ్మెకు పిలుపు

కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశ వ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చాయి కార్మిక సంఘాలు . ఈ నెల 28, 29 తేదీల్లో దేశవ్యాప్త సమ్మె చేపట్టనున్నట్టు చెప్పాయి కార్మిక సంఘాలు.

Bharat Bandh: కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలపై కార్మిక సంఘాల ఆగ్రహం.. ఈనెల 28,29 తేదీల్లో దేశవ్యాప్త సమ్మెకు పిలుపు
Strike
Follow us

|

Updated on: Mar 25, 2022 | 6:42 AM

Bharat Bandh: కేంద్ర ప్రభుత్వం(Central Government) ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశ వ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చాయి కార్మిక సంఘాలు(Trade Unions) . ఈ నెల 28, 29 తేదీల్లో దేశవ్యాప్త సమ్మె చేపట్టనున్నట్టు చెప్పాయి కార్మిక సంఘాలు. సమ్మెలో రవాణా, విద్యుత్తు, బ్యాంకింగ్‌, ఇన్సూరెన్స్‌.. పలు రంగాల కార్మికులు పాల్గొంటారని తెలిపాయి. కేంద్ర ప్రభుత్వం EPF వడ్డీ రేటును 8.5 నుంచి 8.1 శాతానికి తగ్గించడం, ఇంధన ధరలను ఎడాపెడా పెంచడాన్ని తప్పుబట్టాయి కార్మిక సంఘాలు. దీని ప్రభావంతో సామాన్య ప్రజలు, రైతులు, కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు చెప్పాయి కార్మిక సంఘాలు. అలాగే కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రైవేటీకరణ విధానాలకు వ్యతిరేకంగా ఈనెల 28, 29 తేదీల్లో దేశవ్యాప్త సమ్మె చేపట్టనున్నట్టు ప్రకటించారు విద్యుత్తు రంగ ఉద్యోగులు. బుధవారం జరిగిన విద్యుత్తు ఉద్యోగులు, ఇంజినీర్ల జాతీయ సమన్వయ కమిటీ సమావేశంలో భారత్ బంద్ కు నిర్ణయం తీసుకున్నారు.

మరోవైపు. 28,29 తేదీల్లో ప్రభుత్వ రంగ బ్యాంకుల దేశ వ్యాప్త సమ్మెతో ఈ నెల చివరిలో బ్యాంకు సేవలు వరుసగా నాలుగు రోజుల పాటు నిలిచిపోనున్నాయి. 26 శనివారం, 27 ఆదివారం సాధారణ సెలవులు కాగా.. సోమ, మంగళవారం బ్యాంకులు సమ్మెకు దిగుతున్నారు బ్యాంకు ఉద్యోగులు. బ్యాంకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టే దేశ వ్యాప్త సమ్మెలో ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ , బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్, ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ పాల్గొంటున్నట్లు చెప్పారు బ్యాంకు ఉద్యోగులు. ఆయా యాజ‌మాన్యాల‌కు ఇప్పటికే ఆ సంఘాలు నోటీసులు అంద‌జేశాయి. దీంతో భారత్ బంద్ తధ్యమని చెప్తున్నాయి కార్మిక సంఘాలు.

Read Also…  PawanKalyan: వంద నోటుపై నేతాజీ బొమ్మ వేయాలి.. జనసేన అధినేత కీలక వ్యాఖ్యలు..