గొలుసు దొంగతనం చేశాడు.. పోలీసుల నుంచి తప్పించుకునేందుకు గొలుసునే మింగేశాడు.. చివరికి

|

May 28, 2023 | 10:00 PM

ఈ మధ్య గొలుసు దొంగతనాలు ఎక్కడో ఓ చోట తరచుగా జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఓ దొంగ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ఏకంగా బంగారు గొలుసునే మింగేశాడు. ఈ ఘటన జార్ఖండ్ రాజధాని రాంచీలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే డోరండా అనే పోలిస్ స్టేషన్ పరిధిలో ఓ వంతెన సమీపంలో జాఫర్, సల్మాన్ అనే ఇద్దరు చైన్ స్నాచర్లు ఓ మహిళ మెడలో నుంచి బంగారు గొలుసు లాక్కెళ్లారు.

గొలుసు దొంగతనం చేశాడు.. పోలీసుల నుంచి తప్పించుకునేందుకు గొలుసునే మింగేశాడు.. చివరికి
Theif
Follow us on

ఈ మధ్య గొలుసు దొంగతనాలు ఎక్కడో ఓ చోట తరచుగా జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఓ దొంగ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ఏకంగా బంగారు గొలుసునే మింగేశాడు. ఈ ఘటన జార్ఖండ్ రాజధాని రాంచీలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే డోరండా అనే పోలిస్ స్టేషన్ పరిధిలో ఓ వంతెన సమీపంలో జాఫర్, సల్మాన్ అనే ఇద్దరు చైన్ స్నాచర్లు ఓ మహిళ మెడలో నుంచి బంగారు గొలుసు లాక్కెళ్లారు. అయితే ఆ దొంగలు బైక్‌పై పారిపోతుండటం పోలీసులు గమనించారు. వెంటనే కిలోమీటర్ వరకు వాళ్లను వెంబడించి ఆ ఇద్దరు దొంగలను పట్టుకున్నారు. వాళ్లలో సల్మాన్ అనే వ్యక్తి ఆ గొలుసును మింగేశాడు.దీన్ని ఓ పోలీస్ అధికారి కూడా చూశాడు.

ఆ గోలుసు సల్మాన్ అన్నవాహికలో ఇరుక్కుపోయింది. దీంతో అతను కడుపు నొప్పితో బాధపడటంతో పోలీసులు ఆస్పత్రికి తరలించారు. ఎక్స్‌రే తీయించగా ఆ బంగారు గొలుసు అతని శరీరం లోపల చిక్కుకున్నట్లు వైద్యులు గుర్తించారు. ప్రస్తుతం అతడ్ని పర్యవేక్షణలో ఉంచారు. ఎండోస్కోపీ, గ్యాస్ట్రోస్కోపీ లేదా శస్త్రచికిత్స ద్వారా బంగారు గొలుసును బయటకు తీయాలని యోచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.