UK travellers: దెబ్బకు దెబ్బ.. యాక్షన్‌కు దిమ్మదిరిగే రియాక్షన్.. బ్రిటన్‌కు దీటైన సమాధానం ఇచ్చిన భారత్!
యూకే చర్యలకు ఘాటుగా బదులిచ్చింది భారత్. చర్చలు ఫలితాన్నివ్వలేదు. ముందస్తు హెచ్చరికలు పనిచేయలేదు. నచ్చజెప్పినా బ్రిటన్ వినలేదు. ఈ నేపథ్యంలో యూకేపై చర్యలకు దిగింది భారత్.
India on UK travellers: యూకే చర్యలకు ఘాటుగా బదులిచ్చింది భారత్. చర్చలు ఫలితాన్నివ్వలేదు. ముందస్తు హెచ్చరికలు పనిచేయలేదు. నచ్చజెప్పినా బ్రిటన్ వినలేదు. ఈ నేపథ్యంలో యూకేపై చర్యలకు దిగింది భారత్. యూకే నుంచి భారత్ వచ్చే ప్రయాణికులపై ఆంక్షలు విధించింది. భారత్ వచ్చే యూకే వాసులు తప్పనిసరిగా క్వారంటైన్‌లో ఉండాల్సిందేనని స్పష్టం చేసింది. వ్యాక్సినేషన్‌తో సంబంధం లేకుండా ఈ క్వారంటైన్ వర్తిస్తుందని స్పష్టం చేసింది. వ్యాక్సిన్ వేసుకున్నప్పటికీ క్వారంటైన్ రూల్స్ పాటించాల్సిందేనంటోందని భారత్. తాజా రూల్స్ ఈనెల 4 నుంచి అమల్లోకి వస్తాయని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.
క్వారంటైన్‌కు తోడు.. కరోనా టెస్టులు సైతం చేయించుకోవాల్సి ఉంటుందని పేర్కొంది. మరోవైపు భారత దేశానికి రావాలనుకునే ప్రయాణానికి 72 గంటల ముందు కొవిడ్ 19 RT-PCR టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుందని వెల్లడించింది. సదరు టెస్టుల్లో నెగిటివ్ వచ్చినప్పటికీ.. వ్యాక్సిన్ వేసుకున్నప్పటికీ క్వారంటైన్ ఆదేశాలు పాటించాలని సూచించింది. ఇటీవల బ్రిటన్ సైతం భారత ప్రయాణికులపై ఇటువంటి ఆంక్షలనే విధించింది. బ్రిటన్ విధించిన క్వారంటైన్ నిబంధనల్ని సవరించాలంటూ భారత్ అభ్యర్థించినా ఫలితం లేకుండా పోయింది. భారత్‌లో తయారైన కొవిషీల్డ్ వ్యాక్సిన్‌ను ఉపయోగించుకుంటూనే ఇక్కడి వారికి క్వారంటైన్ ఆంక్షలు విధించడంపై మండిపడింది.
ఇదిలావుంటే, యూకే తమ పౌరులపై వివక్ష చూపుతుందంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది భారత్. దీనిపై స్పందించిన బ్రిటన్ భారత్ కొవిషీల్డ్ వ్యాక్సిన్‌తో ఎటువంటి సమస్యల్లేవని పేర్కొంది. అయితే.. సమస్యంతా వ్యాక్సినేషన్ సర్టిఫికెట్‌తోనే అంటూ కొత్త మెలిక పెట్టింది. యూకే ఏమాత్రం తలొగ్గకపోవడంతో కౌంటర్ ఎటాక్‌కు దిగింది భారత్. యూకే మాదిరిగా క్వారంటైన్ ఆంక్షల్ని విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం యూకే వాసులపై ప్రభావం చూపనుంది. భారత్ సందర్శనకు వచ్చే బ్రిటన్ దేశస్తులకు లేటెస్ట్ డెసిషన్ మింగుడు పడని చర్యగా పేర్కొనవచ్చు.
AP Ward and Village Secretariat: గ్రామ సచివాలయాలకు రేపటితో రెండేళ్లు.. ప్రజలకు చేరువైన పాలన..