Uri Encounter: జమ్ము కశ్మీర్‌లో ముగ్గురు ఉగ్రవాదుల హతం.. భారీగా ఆయుదాలు.. కరెన్సీ స్వాధీనం

|

Sep 23, 2021 | 7:16 PM

జమ్ము కశ్మీర్‌లో ముగ్గురు ఉగ్రవాదులను భారత బలగాలు మట్టుబెట్టాయి. యూరిలోని రాంపూర్ సెక్టార్‌లో నియంత్రణ రేఖను దాటి భారత్‌లోకి వచ్చేందుకు యత్నించగా తిప్పికొట్టారు.

Uri Encounter: జమ్ము కశ్మీర్‌లో ముగ్గురు ఉగ్రవాదుల హతం.. భారీగా ఆయుదాలు.. కరెన్సీ స్వాధీనం
Uri Encounter
Follow us on

జమ్ము కశ్మీర్‌లో ముగ్గురు ఉగ్రవాదులను భారత బలగాలు మట్టుబెట్టాయి. యూరిలోని రాంపూర్ సెక్టార్‌లో నియంత్రణ రేఖను దాటి భారత్‌లోకి వచ్చేందుకు యత్నించగా తిప్పికొట్టారు. మొత్తం ఆరుగురు అక్రమంగా భారత్‌లోకి చొరబడేందుకు యత్నించగా ముగ్గురు హతమయ్యారు. మరో ముగ్గురి కోసం భారత బలగాలు గాలిస్తున్నాయి. రాంపూర్ సెక్టార్‌లో యూరి వ‌ద్ద ఉన్న ఎల్వోసీ ద‌గ్గ‌ర ఈ ఎదురుకాల్పులు జ‌రిగాయి. పాకిస్తాన్ ఆక్ర‌మిత క‌శ్మీర్ నుంచి ఆ ముగ్గురు ఉగ్ర‌వాదులు ఇటీవ‌ల భార‌త భూభాగంలోకి చొర‌బ‌డిన‌ట్లు ఇండియ‌న్ ఆర్మీ పేర్కొన్న‌ది. వారి వ‌ద్ద నుంచి అయిదు ఏకే-47 రైఫిళ్లు, 8 పిస్తోళ్లు, 70 హ్యాండ్ గ్రేనేడ్ల‌ను రిక‌వ‌రీ చేశారు.

హ‌త్లాంగా ఫారెస్ట్ వ‌ద్ద చొర‌బాటుదారులు క‌దులుతున్న‌ట్లు గుర్తించామ‌ని శ్రీన‌గ‌ర్ చినార్ కార్ప్స్ ఆఫీస‌ర్ లెఫ్టినెంట్ జ‌న‌ర‌ల్ డీపీ పాండే తెలిపారు. ఆ క్ర‌మంలో చేప‌ట్టిన ఆప‌రేష‌న్‌లో ముగ్గురు ఉగ్ర‌వాదుల‌ను హ‌త‌మార్చిన‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు. ఉగ్రవాదులు ఇటీవల పాకిస్తాన్ పాలిత కాశ్మీర్ నుండి భారతదేశం వైపుకు వచ్చినట్టు గుర్తించారు.

యురి ఆపరేషన్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. వారి నుంచి 5 AK రైఫిల్స్, 24 UBGL, 7 హ్యాండ్ గ్రెనేడ్‌లు మరియు 35,000 ఇండియన్, పాకిస్తానీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు.

ఇవి కూడా చదవండి: Bats with Covid: అక్కడి గబ్బిలాల్లో మరో కొత్త వైరస్.. ఈజీగా వ్యాపిస్తుందంటున్న పరిశోధకులు..

Stock market update: బుల్‌ రంకెలేసింది.. రికార్డుల మోత మోగించింది.. ఇన్వెస్టర్లలో లాభాల పంట..

రోడ్డు పై స్విమ్మింగ్ పూల్.. బురద నీటిలో శవాసనం.. అతనెవరో తెలిస్తే షాక్ అవుతారు..