Madhya Pradesh: వేటగాళ్ల కాల్పులు.. ముగ్గురు పోలీసులు మృతి.. ఘటనపై ముఖ్యమంత్రి సీరియస్

మధ్యప్రదేశ్‌లో(Madhya Pradesh) దారుణ ఘటన జరిగింది. పోలీసులపై వేటగాళ్లు జరిపిన కాల్పుల్లో ముగ్గురు పోలీసులు మృతి చెందారు. శనివారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం...

Madhya Pradesh: వేటగాళ్ల కాల్పులు.. ముగ్గురు పోలీసులు మృతి.. ఘటనపై ముఖ్యమంత్రి సీరియస్
Gun Firing
Follow us
Ganesh Mudavath

|

Updated on: May 15, 2022 | 1:50 PM

మధ్యప్రదేశ్‌లో(Madhya Pradesh) దారుణ ఘటన జరిగింది. పోలీసులపై వేటగాళ్లు జరిపిన కాల్పుల్లో ముగ్గురు పోలీసులు మృతి చెందారు. శనివారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసు ఉన్నతాధికారులు దుండగులను పట్టుకునేందుకు రంగంలోకి దిగారు. ఈ క్రమంలో పోలీసులు చేపట్టిన కాల్పుల్లో ఇద్దరు నిందితులు మరణించారు. అరుదైన జాతికి చెందిన నాలుగు జింకలను వేటగాళ్లు వేటాడినట్లు సమాచారం అందడంతో పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లారు. దీంతో తమను చుట్టుముట్టిన పోలీసులపై దుండగులు కాల్పులు జరిపారు. ఈ దాడిలో సబ్‌-ఇన్‌స్పెక్టర్‌ రాజ్‌కుమార్‌ జాదవ్‌, కానిస్టేబుళ్లు నీలేశ్‌ భార్గవ, శాంతారామ్‌ మీనాలు ప్రాణాలు కోల్పోయారు. వేటగాళ్ల కాల్పుల్లో పోలీసులు మృతిచెందిన ఘటనపై ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ భోపాల్‌లోని తన నివాసంలో అత్యవసరంగా ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. డీజీపీ, హోంమంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సహా పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. ప్రాణాలు కోల్పోయిన ముగ్గురు పోలీసుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం చెల్లిస్తామని సీఎం ప్రకటించారు. వారిని అమరవీరులుగా గుర్తిస్తామని, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చారు.

ప్రభుత్వ ఆదేశాలతో నిందితుల కోసం పోలీసులు అటవీ ప్రాంతంలో గాలింపులు చేపట్టారు. గాలింపుల్లో భాగంగా ఇద్దరు వేటగాళ్లు పోలీస్ కాల్పుల్లో మరణించారు. మరో ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు గుణ జిల్లా ఎస్పీ రాజీవ్ కుమార్ శర్మ వెల్లడించారు. మరో ముగ్గురు నిందితులు తప్పించుకున్నారని, వారిని కూడా తమ అధికారులు త్వరలోనే అరెస్ట్ చేస్తారని వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

 Asaduddin Owaisi: ముస్లింలు ప్రభుత్వాన్ని మార్చలేరు.. ఓటు బ్యాంక్‌పై ఓవైసీ కీలక కామెంట్స్‌..

Chandrababu: జగన్ ఇలాకాలోకి ఎంట్రీ ఇవ్వడానికి ప్లాన్‌.. ఈనెల 18న కడపలో చంద్రబాబు పర్యటన..