Modi on Third Front: కేసీఆర్ థర్డ్‌ ఫ్రంట్‌ డైలాగ్‌కి మోదీ కౌంటర్.. కేసీఆర్ ముందున్న ఆప్షన్స్ ఏంటి..?

|

May 03, 2024 | 8:38 AM

ఆప్షన్‌1, ఆప్షన్2, ఆప్షన్3 అంటూ నేషనల్ పాలిటిక్స్‌లో తన ఫ్యూచర్‌ని వెతుక్కుంటున్నారు గులాబీ దళపతి కేసీఆర్. కానీ.. ఫస్ట్ ఆప్షన్‌కి నో చెప్పేశారు సీఎం రేవంత్‌రెడ్డి. ఇప్పుడు సెకండ్ ఆప్షన్‌ని కూడా తిరగ్గొట్టేశారు ప్రధాని నరేంద్ర మోదీ. టీవీ9కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్య్వూలో కేసీఆర్ పొలిటికల్ ఫ్యూచర్‌పై ప్రధాని మోద క్లారిటీ ఇచ్చేశారు.

Modi on Third Front: కేసీఆర్ థర్డ్‌ ఫ్రంట్‌ డైలాగ్‌కి మోదీ కౌంటర్.. కేసీఆర్ ముందున్న ఆప్షన్స్ ఏంటి..?
Modi On Third Front
Follow us on

ఆప్షన్‌1, ఆప్షన్2, ఆప్షన్3 అంటూ నేషనల్ పాలిటిక్స్‌లో తన ఫ్యూచర్‌ని వెతుక్కుంటున్నారు గులాబీ దళపతి కేసీఆర్. కానీ.. ఫస్ట్ ఆప్షన్‌కి నో చెప్పేశారు సీఎం రేవంత్‌రెడ్డి. ఇప్పుడు సెకండ్ ఆప్షన్‌ని కూడా తిరగ్గొట్టేశారు ప్రధాని నరేంద్ర మోదీ. టీవీ9కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్య్వూలో కేసీఆర్ పొలిటికల్ ఫ్యూచర్‌పై ప్రధాని మోద క్లారిటీ ఇచ్చేశారు. కేసీఆర్ ముందున్న ఆప్షన్స్ ఏంటి.. మోదీ ఇచ్చిన రియాక్షన్ ఏంటి? అన్నదీ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బస్సు యాత్ర చేస్తూ కేసీఆర్ పేల్చిన సంకీర్ణం బాంబ్.. నేషనల్ పాలిటిక్స్‌లో సైతం కదలిక తీసుకొచ్చింది. నామాకు కేంద్రమంత్రి యోగం ఉందన్న కేసీఆర్ మాటల్లో మర్మం ఏంటి అనే చర్చ మొదలైంది. కేంద్రంలో సంకీర్ణం వస్తోందన్న కేసీఆర్ జోస్యంపై ప్రధాని మోదీ కూడా స్పందించారు. టీవీ9 నెట్‌వర్క్‌కిచ్చిన ఇంటర్వ్యూలో కేసీఆర్ పొలిటికల్ ఫ్యూచర్‌పై క్లారిటీ ఇచ్చారు నరేంద్ర మోదీ.

ఒకవేళ ఎన్‌డీఏ కూటమికి సీట్లు తగ్గి.. కాంగ్రెస్ కూటమి బలపడి.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశమే వస్తే కేసీఆర్ ఏం చేస్తారు..? అనే చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలోనే ఇండియా కూటమిలో మాత్రం చేర్చుకునే ప్రసక్తే లేదన్నారు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి. కేసీఆర్‌కి మిగిలిన ఏకైక మార్గం ఎన్డీఏ కూటమే కనుక.. బీఆర్‌ఎస్-బీజేపీ రెండూ కలిసి లోక్‌సభ ఎన్నికల్లో డ్రామాలాడుతున్నాయని రేవంత్ ఆరోపించారు.

ఈ నేపథ్యంలోనే పక్కా క్లారిటీ ఇచ్చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. ఇప్పటికే ఒకసారి కలిసుందాం రా అని కేసీఆర్‌కు ఆఫర్ ఇచ్చినా తిరస్కరించి పంపామని, మళ్లీ వచ్చినా అదే ఆన్సర్ అని తేల్చేశారు ప్రధాని మోదీ. ఎన్‌డీఏలోకి రానిచ్చే ప్రసక్తే లేదని మోదీ తేల్చేశారు. ఎన్డీఏ కూటమికి వచ్చే సీట్లపై మరోసారి క్లారిటీ ఇచ్చారు మోదీ. ఈసారి 400 ఎంపీ స్థానాలు గెలవడం కాదు.. ఆల్రెడీ 400 సీట్లు తమ దగ్గరే ఉన్నాయంటూ ఫుల్ కాన్ఫిడెన్స్‌తో చెప్పుకొచ్చారు. ఇప్పటికిప్పుడు ఎన్డీఏ దగ్గర 360 సీట్లు ఉన్నాయన్నారు ప్రధాని. ఎన్డీఏలో లేకున్నా బీజేడీతో పాటు మిగతా వారిని కూడా కలుపుకొంటే తమ దగ్గర 400 సీట్లు ఉన్నట్టేనని సమాధానమిచ్చారు.

మొత్తానికి ఇండియా కూటమిలోకి సైతం నో ఎంట్రీ బోర్డు అడ్డం పెట్టారు రేవంత్‌రెడ్డి. మరి.. మిగతా ప్రాంతీయ పార్టీల్ని కూడగట్టి థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేసి.. స్టీరింగ్ చేతికి తీసుకోవడమే కేసీఆర్ ముందున్న ఏకైక దారి. ఏదేమైనా లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ దక్కించుకునే సీట్ల సంఖ్యపైనే కేసీఆర్ జాతీయ రాజకీయాలు ఆధారపడి ఉంటాయనేది పక్కా.!

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…