Expensive Mushrooms: ఇవి ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పుట్టగొడుగులు.. ధరెంతో తెలిస్తే కళ్లు తేలేస్తారు..

|

Apr 19, 2023 | 1:52 PM

పుట్టగొడుగుల గురించి తెలియని వారుండరు. వర్షాకాలంలో పొలాల్లో కుప్పలుతెప్పలుగా మొలిచే ఓ రకమైన మొక్కలు ఇవి. వీటిని కృత్రిమ పద్ధతుల్లో కూడా పండిస్తుంటారు. ఐతే ప్రపంచంలో కొన్ని అరుదైన పుట్టగొడుగులు ఉన్నాయి. ఇవి ఆరోగ్యానికి సంజీవని వంటివి మాత్రమేకాదు..

Expensive Mushrooms: ఇవి ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పుట్టగొడుగులు.. ధరెంతో తెలిస్తే కళ్లు తేలేస్తారు..
Follow us on

పుట్టగొడుగుల గురించి తెలియని వారుండరు. వర్షాకాలంలో పొలాల్లో కుప్పలుతెప్పలుగా మొలిచే ఓ రకమైన మొక్కలు ఇవి. వీటిని కృత్రిమ పద్ధతుల్లో కూడా పండిస్తుంటారు. ఐతే ప్రపంచంలో కొన్ని అరుదైన పుట్టగొడుగులు ఉన్నాయి. ఇవి ఆరోగ్యానికి సంజీవని వంటివి. వీటి ఖరీదు కూడా మామూలుగా ఉండదు. ఏకంగా లక్షల్లో ఉంటుంది. అవేంటో తెలుసుకుందాం..

గుచ్చి మష్రూమ్..

Gucchi Mushroom

ఈ అడవి పుట్టగొడుగు హిమాలయ పర్వతాల సమీప ప్రాంతాల్లో మాత్రమే కనిపిస్తాయి. ఇవి చైనా, నేపాల్, భారత్‌, పాకిస్తాన్‌లలో పెరుగుతాయి. అనేక ఔషధ గుణాలు కలిగిన వీటిని స్పాంజ్ మష్రూమ్ అని కూడా అంటారు. అంతర్జాతీయ మార్కెట్‌లో గుచ్చి మష్రూమ్ కిలో రూ.25,000 నుంచి 30,000 వరకు విక్రయిస్తుంటారు. ఈ మష్రూమ్‌కు విదేశీ మార్కెట్‌లో డిమాండ్‌ ఎక్కువ.

బ్లాక్ ట్రఫుల్ మష్రూమ్

Black Truffle Mushroom

ఇవి ఐరోపాలోని వైట్ ట్రఫుల్ మష్రూమ్‌ను పోలి ఉంటుంది. ఇది కూడా చాలా అరుదైన పుట్టగొడుగు. ఈ పుట్టగొడుగులను వెదకడానికి శిక్షణ ఇచ్చిన కుక్కలను ఉపయోగిస్తుంటారు. విదేశీ మార్కెట్లలో వీటి ధర కిలో రూ. 1 లక్ష నుంచి 2 లక్షల వరకు పలుకుతుంది.

ఇవి కూడా చదవండి

యూరోపియన్ వైట్ ట్రఫుల్ మష్రూమ్

European White Truffle Mushroom

వీటిని ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పుట్టగొడుగులుగా పిలుస్తారు. ఇవి చాలా అరుదైన పుట్టగొడుగులు. వీటిని సాగు చేయడం కుదరదు. చెట్లపై మాత్రమే పెరుగుతుంది. యూరోపియన్ వైట్ ట్రఫుల్ మష్రూమ్స్‌కు అంతర్జాతీయ మార్కెట్‌లో కిలో ధర రూ.7 లక్షల నుంచి రూ.9 లక్షల వరకు ఉంటుంది.

మట్సుటేక్ మష్రూమ్

Matsutake Mushroom

జపాన్‌లో అత్యంత ఖరీదైన పుట్టగొడుగులివి. దీని సువాసన మరే పూలకు కూడా ఉండదు. బ్రౌన్ కలర్‌లో ఉండే ఈ మష్రూమ్ చాలా రుచిగా ఉంటాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో వీటి ధర కిలో రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు విక్రయిస్తుంటారు.

బ్లూ ఆయిస్టర్ మష్రూమ్

Blue Oyster Mushroom

సాధారణంగా వైట్ ఓస్టెర్ మష్రూమ్ అనే పేరు వినే ఉంటారు. ఐతే బ్లూ ఓస్టెర్ మష్రూమ్ గురించి చాలా మందికి తెలిసి ఉండదు. వీటిల్లో ప్రోటీన్, కార్బోహైడ్రేట్లు, కొవ్వు, ఫైబర్ అధికంగా ఉంటుంది. ఈ మష్రూమ్‌ను కిలో రూ.150 నుంచి 200 వరకు మార్కెట్‌లో విక్రయిస్తున్నారు. వీటిరి మన దేశంలో కూడా సాగు చేస్తున్నారు.

చాంటెరెల్ మష్రూమ్

Chanterelle Mushrooms

ఈ పుట్టగొడుగులు ఎక్కువగా అడవి ప్రాంతాల్లో మాత్రమే కనిపిస్తాయి. ఇవి ప్రకృతి సహజ సిద్ధంగా పెరుగుతాయి. ఐరోపా, ఉక్రెయిన్ బీచ్‌లలో ఎక్కువగా కనిపిస్తుంది. చాంటెరెల్ మష్రూమ్‌లు అనేక రంగుల్లో దొరుకుతుంటాయి. వీటిల్లో పసుపు రంగు సెంట్రల్ మష్రూమ్‌కు డిమాండ్‌ ఎక్కువ. అంతర్జాతీయ మార్కెట్‌లో కిలోకు రూ.30,000 నుంచి 40,000 వరకు విక్రయిస్తుంటారు.

ఎనోకి మష్రూమ్

Enoki Mushroom

ఈ అడవి పుట్టగొడుగులను జపాన్, చైనాలలో సాగుచేస్తారు. మరియు తింటారు. ఇవి చైనాలోని హ్యాక్‌బెర్రీ, పీచు, బూడిద, మల్బరీ, ఖర్జూరం చెట్లపై పెరిగే అడవి పుట్టగొడుగులు. వీటిని వింటర్ ఫంగస్ అని కూడా పిలుస్తారు. వీటిల్లోని యాంటీఆక్సిడెంట్లు క్యాన్సర్ వంటి వ్యాధుల బారీన పడకుండా కాపాడుతాయి.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.