IAS vs IPS: రోహిణి నా భర్తని కూడా ఉపయోగించుకుందని రూప ఆరోపణలు .. IPS-IAS గొడవల ఆడియో లీక్ ..

|

Feb 22, 2023 | 5:30 PM

భూమికి సంబంధించిన అనేక రకాల పనులు చేయించుకునేందుకు రోహిణి తన భర్తను ఉపయోగించుకున్న విషయం కూడా తెరపైకి వతెచ్చారు రూప. ఐఏఎస్ రోహిణి కుటుంబం భూ లావాదేవీలు, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నదని రూప ఆరోపించారు

IAS vs IPS: రోహిణి నా భర్తని కూడా ఉపయోగించుకుందని రూప ఆరోపణలు .. IPS-IAS గొడవల ఆడియో లీక్ ..
Ias Vs Ips
Follow us on

కర్ణాటకకు చెందిన ఇద్దరు సీనియర్ మహిళా అధికారుల మధ్య జరిగిన గొడవ ప్రస్తుతం నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. ఇద్దరు మహిళా ఆఫీసర్లు బహిరంగంగా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. ఈ వ్యవహారం తీవ్రస్థాయికి చేరడంతో ప్రభుత్వం వీరిద్దరినీ బదిలీ చేసింది. ఐఏఎస్‌ రోహిణి సింధూరి, ఐపీఎస్‌ రూపా మౌఢ్గిల్‌ లు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. అసలు ఎందుకు ఈ ఉద్రిక్తత ఏర్పడిందో టీవీ 9 కన్నడ వెల్లడించింది. 2 ఆడియోల ద్వారా ఈ విష‌యం బ‌య‌టికి వ‌చ్చింది.

రూపా ప్రస్తుతం హోంగార్డ్స్‌ ఐజీగా ఉండగా.. రోహిణి సింధూరి దేవాదాయ శాఖ రాష్ట్ర కమిషనర్‌గా ఉన్నారు. ఐపీఎస్ రూప ఆర్టీఐ కార్యకర్త గంగరాజుతో మాట్లాడారు. ఈ ఆడియోలో రూప తన భర్త గురించి.. అనంతరం ఐఏఎస్ రోహిణి గురించి ప్రస్తావించారు. రూపా భర్త సర్వే సెటిల్‌మెంట్ ..  ల్యాండ్ రికార్డ్స్‌లో ఐఏఎస్ అధికారి .. కమిషనర్.

భూమికి సంబంధించిన అనేక రకాల పనులు చేయించుకునేందుకు రోహిణి తన భర్తను ఉపయోగించుకున్న విషయం కూడా తెరపైకి వతెచ్చారు రూప. ఐఏఎస్ రోహిణి కుటుంబం భూ లావాదేవీలు, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నదని రూప ఆరోపించారు. రూప రోహిణిని క్యాన్సర్ అని పిలుస్తున్నారు.  ఆమె చాలా మంది ఐఎఎస్ అధికారుల కుటుంబాలను నాశనం చేసిందని ఆరోపించారు.

ఇవి కూడా చదవండి

కుటుంబాలను నాశనం చేస్తున్న రూప రోహిణిపై ఆరోపణలు

రూప ఫేస్‌బుక్ పోస్ట్‌లో డియర్ మీడియా.. దయచేసి నేను రోహిణి సింధూరిపై లేవనెత్తిన అవినీతి అంశంపై దృష్టి పెట్టండి. అవినీతికి వ్యతిరేకంగా పోరాడకుండా తాను ఎవరినీ ఆపలేదని ఈ సమయంలో రోహిణి పై దర్యాప్తు చేయాలని కోరారు.

అంతేకాదు.. తాను తన భర్త ఇంకా కలిసి ఉన్నాము అని చెప్పారు. తమ వ్యక్తిగత జీవితంపై ఎలాంటి ఊహాగానాలు చేయవద్దు. కుటుంబానికి ఆటంకంగా మారిన నేరస్థులను విచారించండి. లేకుంటే ఎన్నో కుటుంబాలు నాశనమవుతాయి. నేను బలమైన స్త్రీని, నేను పోరాడతాను. బాధిత మహిళలందరి కోసం నేను పోరాడుతున్నాను. మహిళలందరికీ ఒకే విధమైన పోరాట శక్తి ఉండదు, దయచేసి అలాంటి మహిళల గొంతుకగా ఉండండి. భారతదేశం కుటుంబ విలువలకు ప్రసిద్ధి చెందింది అని పేర్కొన్నారు రూప మౌఢ్గిల్‌.

రోహిణి ప్రైవేట్ ఫోటోలు కూడా షేర్ చేశారు
అంతకుముందు, రూపా సింధూరి వ్యక్తిగత చిత్రాలను సోషల్ మీడియాలో విడుదల చేశారు రూప మౌఢ్గిల్‌. రోహిణి కొంతమంది మగ అధికారులతో పంచుకుందని ఆరోపించారు. అయితే రోహిణి ఈ ఆరోపణపై స్పందిస్తూ.. రూప చేస్తోన్న ఆరోపణలు నిరాధారమైనవని, బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న రూప వ్యక్తిగత ద్వేషంతో తనపై ఇలాంటి వ్యాఖ్యలు చేస్తోందని, మానసిక సమతుల్యత కోల్పోయినట్లు ప్రవర్తిస్తోందని అన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..