Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

The first Island: ప్రపంచంలో మొట్టమొదట సముద్రం నుంచి బయటకు వచ్చిన ద్వీపం మన దేశంలోనే ఉంది.. ఎక్కడో తెలుసా?

ప్రపంచంలో మొదటగా సముద్రం నుంచి బయటికి వచ్చిన ద్వీపం ఏది? ఈ ప్రశ్నకు సమాధానం అందరూ.. సముద్రం నుంచి మొదట ఆఫ్రికా, ఆస్ట్రేలియా బయటికి వచ్చాయని చెబుతారు. దీనినే మనమందరం ఇన్నాళ్ళుగా నమ్ముతున్నాము.

The first Island: ప్రపంచంలో మొట్టమొదట సముద్రం నుంచి బయటకు వచ్చిన ద్వీపం మన దేశంలోనే ఉంది.. ఎక్కడో తెలుసా?
The Worlds First Island
Follow us
KVD Varma

|

Updated on: Dec 12, 2021 | 8:40 PM

The first Island: ప్రపంచంలో మొదటగా సముద్రం నుంచి బయటికి వచ్చిన ద్వీపం ఏది? ఈ ప్రశ్నకు సమాధానం అందరూ.. సముద్రం నుంచి మొదట ఆఫ్రికా, ఆస్ట్రేలియా బయటికి వచ్చాయని చెబుతారు. దీనినే మనమందరం ఇన్నాళ్ళుగా నమ్ముతున్నాము. కానీ, ఇప్పుడు కొత్త పరిశోధనలో జార్ఖండ్‌లోని సింగ్‌భూమ్ జిల్లా సముద్రం నుంచి బయటకు వచ్చిన ప్రపంచంలోనే మొదటి భూ భాగం అని తేలింది. 3 దేశాలకు చెందిన 8 మంది పరిశోధకులు 7 సంవత్సరాల పరిశోధన తర్వాత ఈ నిర్ణయానికి వచ్చారు.

పరిశోధకుల ఈ కొత్త ఆవిష్కరణ కథనం ఇదే..

సింగ్‌భూమ్‌లోని పరిశోధనా బృందానికి నాయకత్వం వహించిన ఆస్ట్రేలియాకు చెందిన పీటర్ కేవుడ్, ‘మన సౌర వ్యవస్థ, భూమి లేదా ఇతర గ్రహాలు ఎలా ఏర్పడ్డాయి? ఈ ప్రశ్నల కోసం, నేను, నా 7 మంది సహచరులు, భారతదేశానికి చెందిన 4 మంది కలిసి జార్ఖండ్‌లోని కోల్హాన్, ఒడిషాలోని కియోంజర్‌తో సహా అనేక ఇతర జిల్లాల్లోని కొండలు, పర్వతాలను 7 సంవత్సరాల పాటు పరిశీలించాము. సముద్రం నుంచి భూమి ఎప్పుడు వచ్చిందనే ప్రశ్నకు సమాధానం వెతుక్కోవాలనే వ్యామోహం తప్పనిసరి. అందుకే ఈ పరిశోధన మొదలు పెట్టం. అయితే, ఈ ప్రదేశం నక్సల్స్ ప్రభావిత ప్రాంతం. కానీ మేం మా ప్రయత్నం చేయాల్సిందే, అందుకే కష్టమైనా పరిశోధనలు చేయాలనే నిర్ణయించుకున్నాం.” అంటూ చెప్పారు.

వారి 6-7 సంవత్సరాల ఫీల్డ్ వర్క్‌లో, ప్రయోగశాలలో సుమారు 300-400 కిలోల రాళ్లను పరీక్షించారు. వీటిలో కొన్ని ఇసుకరాళ్లు.. కొన్ని గ్రానైట్ ఉన్నాయి. వీరు పరిశోధన కోసం తీసుకున్న ఇసుకరాళ్ల ప్రత్యేకత ఏమిటంటే అవి నది లేదా సముద్రం ఒడ్డున ఏర్పడ్డాయి.

సింగ్‌భూమ్ 320 మిలియన్ సంవత్సరాల క్రితం ఏర్పడింది

పీటర్ ఈ విషయంపై మరింత మాట్లాడుతూ, ‘మేము ఇసుకరాళ్ల వయస్సును నిర్ణయించడానికి ప్రయత్నించినప్పుడు, సింభూమ్ నేటి నుంచి 320 మిలియన్ సంవత్సరాల క్రితం ఏర్పడిందని మాకు తెలిసింది. అంటే 320 మిలియన్ సంవత్సరాల క్రితం, ఈ భాగం ప్లాట్ రూపంలో సముద్ర మట్టానికి పైన ఉండేది. ఇప్పటి వరకు ఆఫ్రికా, ఆస్ట్రేలియా ప్రాంతాలు మొదట సముద్రంలో నుంచి ఉద్భవించాయని నమ్ముతారు. కానీ సింఘ్‌భూమ్ ప్రాంతం వాటి కంటే 200 మిలియన్ సంవత్సరాల ముందుగానే వచ్చిందని మేము కనుగొన్నాము. సింఘ్‌భూమ్ క్రాటన్ సముద్రం నుంచి బయటపడిన మొదటి ద్వీపం అనే మా వాదన సరైనది అని తేలడం మా మొత్తం జట్టుకు చాలా ఉత్తేజకరమైన క్షణం.” అని వివరించారు.

ఈ ప్రాంతాన్ని సింగ్‌భూమ్ ఖండం అని పిలుస్తారు. సింఘ్‌భూమ్ ఖండం 320 మిలియన్ సంవత్సరాల క్రితం సముద్ర ఉపరితలంపైకి వచ్చింది. అయితే దాని నిర్మాణం ప్రక్రియ అంతకుముందే ప్రారంభమైంది. ఈ ప్రాంతం ఉత్తరాన జంషెడ్‌పూర్ నుంచి దక్షిణాన మహాగిరి వరకు, తూర్పున ఒడిషాలోని సిమ్లిపాల్ నుంచి పశ్చిమాన వీర్ తోలా వరకు విస్తరించి ఉంది. ఈ ప్రాంతాన్ని సింగ్‌భూమ్ క్రాటన్ లేదా ఖండం అని పిలుస్తారు. పీటర్ మాట్లాడుతూ, “పరిశోధన కోసం, మేము గత 6-7 సంవత్సరాలలో సింగభూమ్ ఖండంలోని సిమ్లిపాల్, జోడా, జంషెడ్‌పూర్, కియోంజర్ మొదలైన అనేక ప్రాంతాల్లో అనేకసార్లు ఫీల్డ్ వర్క్ చేసాము. అధ్యయనం సమయంలో మా కేంద్రం జంషెడ్‌పూర్,ఒడిశా జంట నగరం. ఇక్కడి నుంచి కొన్నిసార్లు బైక్‌లో , కొన్నిసార్లు బస్సు-కార్‌లో పరిశోధనల కోసం వెళ్ళాం.” అని చెప్పారు.

తదుపరి పరిశోధన కోసం తెరచుకున్న దారి..

సముద్రం నుంచి బయటకు వచ్చిన ప్రపంచంలోని మొదటి ద్వీపం సింగ్‌భూమ్. అంటే, ఇనుప ఖనిజం కొండలతో సహా ఇతర కొండలు 320 మిలియన్ సంవత్సరాల కంటే పాతవి. కొండ ప్రాంతాలు లేదా పీఠభూమి ప్రాంతాల్లో ఇనుము, బంగారు గనులను కనుగొనడంలో ఈ పరిశోధన మాడ్యూల్ సులభతరం చేస్తుంది. ఇది కాకుండా, బస్తర్, ధార్వాడ ప్రాంతాల్లో భూగర్భ సంఘటనల మూలం గురించి సమాచారం అందుబాటులో ఉంటుంది. ఈ పరిశోధన భౌగోళిక అధ్యయనాలకు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

ఇవి కూడా చదవండి: Medicine with Milk: టాబ్లెట్స్ పాలతో లేదా జ్యూస్ లతో ఎందుకు తీసుకోకూడదో తెలుసా.. కొన్ని టాబ్లెట్ రేపర్స్ పై ఎర్రని గీత ఎందుకుంటుంది? తెలుసుకోండి!

India help to Afghanistan: ఆఫ్ఘనిస్తాన్‌కు చేరిన భారత్ మెడిసిన్స్.. తాలిబన్ల ధన్యవాదాలు.. ఈ సహాయంపై వారెమన్నారంటే..