AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Republic day: దేశంలో రిపబ్లిడ్ డే వేడుకల జోష్.. ఈ రోజుకున్న ప్రత్యేకతలు తెలుసా..?

రిపబ్లిక్ డే వేడుకల ఏర్పాట్లతో దేశంలో ఎక్కడ చూసినా సందడి నెలకొంది. జనవరి 26వ తేదీన జరిగే ఈ జాతీయ పండగకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. దేశంలోని చిన్న గ్రామాల నుంచి పెద్ద పట్టణాల వరకూ అంబరాన్నంటేలా సంబరాలు జరగనున్నాయి. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన ఆగస్టు 15తో పాటు రాజ్యాంగం అమల్లోకి వచ్చిన జనవరి 26వ తేదీ మనకు ఎంతో ముఖ్యమైనది. ఈ సందర్బంగా గణతంత్ర (రిపబ్లిక్) దినోత్సవ ప్రత్యేకతలను తెలుసుకుందాం.

Republic day: దేశంలో రిపబ్లిడ్ డే వేడుకల జోష్.. ఈ రోజుకున్న ప్రత్యేకతలు తెలుసా..?
Republic Day 2025
Nikhil
|

Updated on: Jan 25, 2025 | 4:15 PM

Share

ప్రతి ఏటా జనవరి 26వ తేదీన గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తారు. ఈ ఏడాది 2025లో 76వ గణతంత్ర వేడుకలను నిర్వహించుకోనున్నాం. 1950లో ఇదే రోజున భారత రాజ్యాంగం అమలులోకి వచ్చింది. నాటి నుంచి గణతంత్ర దేశంగా ప్రకటించబడింది. ఈ రోజు దేశవ్యాప్తంగా సెలవును ప్రకటిస్తారు. రాజ్యాంగం ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేస్తారు. ప్రతి చోటా జెండా ఎగురవేస్తారు. దేశ రాజధాని ఢిల్లీలోని కర్తవ్య పథ్ లో రిపబ్లిక్ డే పరేడ్ ను అత్యంత ఘనంగా నిర్వహిస్తారు.

రిపబ్లిక్ డే ప్రత్యేకతలు

  • భారత జాతీయ కాంగ్రెస్ 1930లో పూర్ణ స్వరాజ్ ప్రకటన చేసింది. దాని జ్ఞాపకార్థం జనవరి 26వ తేదీన రిపబ్లిక్ డే జరుపుకొంటారు.
  • రిపబ్లిక్ డే పరేడ్ సన్నాహాలు ఆ ముందు ఏడాది జూలైలో ప్రారంభమవుతాయి. దానిలో పాల్గొనేవారు తమ వివరాలను అధికారికంగా తెలియజేస్తారు. పరేడ్ జరిగే రోజు తెల్లవారుజాము 3 గంటలకే కర్తవ్య పథ్ కే చేరుకుంటారు. అప్పటికే దాదాపు 600 గంటల పాటు సాధన చేసి ఉంటారు.
  • ఢిల్లీలో జరిగే రిపబ్లిడ్ డే వేడుకలను ఏటా ముఖ్య అతిథిగా ఒక దేశ ప్రధాని లేదా రాష్ట్రపతి లేదా పాలకులను ఆహ్వానిస్తారు. ప్రస్తుతం జరుగుతున్న వేడుకలకు ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో ముఖ్య అతిథిగా రానున్నారు.
  • గన్ సెల్యూట్ ఫైరింగ్ ప్రధాన ఆకర్షణగా ఉంటుంది. జాతీయ గీతం ప్రారంభంలో మొదటి గన్ షాట్ పేలుతుంది. అనంతరం 52 సెకన్ల తర్వాత కాల్చుతారు.
  • ప్రతి ఏటా రిపబ్లిక్ డే వేడుకల కోసం ఒక థీమ్ ను తయారు చేస్తారు. దాన్ని అన్ని రాష్ట్రాలు, ప్రభుత్వ శాఖలు అనుసరిస్తాయి. ఈ ఏడాది జరిగే పరేడ్ లో టెబుల్ యాక్స్ థీమ్ గా స్వర్ణిమ్ భారత్ – విరాసత్ జౌర్ వికాస్ (బంగారు భారత దేశం – వారసత్వం, అభివృద్ధి) గా నిర్ణయించారు. దీని ప్రకారం సాంకేతికత, మౌలిక సదుపాయాలు, సంప్రదాయం, దేశ పురోగతిపై ప్రదర్శనలు ఉంటాయి.
  • రాష్ట్రపతి భవన్ సమీపంలోని రైసినా హిల్ నుంచి కర్తవ్య పథ్, ఇండియా గేట్, ఎర్రకోట మీదుగా గ్రాండ్ కవాతు జరుగుతుంది.
  • డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ తదితర ఎందరో మహానుబావులు భారత రాజ్యాంగాన్ని తయారు చేశారు.
  • న్యూ ఢిల్లీలోని ఇర్విన్ స్డేడియంలో 1950లో మొట్టమొదటి రిపబ్లిక్ డే వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో సైన్యానికి చెందిన 100 కంటే ఎక్కువ విమానాలు, 3 వేల మంది సిబ్బంది పాల్గొన్నారు. ఇర్విన్ స్డేడియాన్ని ప్రస్తుతం మేజర్ ధ్యాన్ చంద్ నేషనల్ స్టేడియంగా పిలుస్తున్నారు.
  • ప్రజల ప్రాణాలను కాపాడిన వారు, అన్యాయాలను వ్యతిరేకంగా పోరాటం చేసినవారు, అసమాన ధైర్యసాహసాలు ప్రదర్శించిన పిల్లలకు రిపబ్లిడ్ డే రోజు జాతీయ శౌర్య పతకాలు అందిస్తారు.
  •  అలాగే పలు రంగాల్లో తమ ముద్ర చేసుకున్న వారికి రాష్ట్రపతి పద్మ పురస్కారాలను ప్రధానం చేస్తారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..