50 ఏళ్లైనా మరిచిపోలేని గాయం అది.. ఎందుకని నేటికీ ఆనాటి ప్రకంపనలు?

అప్పట్లో ఇందిరకు ఒక పేరుండేది. దట్‌ మీన్స్‌ అలా అభివర్ణించేవారు. క్యాబినెట్‌లో ఉన్న ఏకైక మగాడు ఇందిరాగాంధీ అని. ఆమె తీసుకున్న సాహసోపేత నిర్ణయాలు, సంస్కరణలు అలా ఉండేవి కాబట్టి అలా వర్ణించేవారు. ప్రతిపక్ష నేతలే అపర దుర్గగా కీర్తించారు. ఇందిర అంటే దేశప్రజలకు ఎంతటి ఆరాధనా భావమో ఆనాడు. ఇందిర కాదు ఇందిరమ్మ అని పిలుచుకునే వాళ్లు. రాజకీయాల్లో అప్పటి వరకు అంతటి శక్తిమంతురాలిని, బలవంతురాలిని చూడలేదెవరు.

50 ఏళ్లైనా మరిచిపోలేని గాయం అది.. ఎందుకని నేటికీ ఆనాటి ప్రకంపనలు?
The Story Of Emergency

Updated on: Jun 25, 2025 | 10:16 PM

‘అవమానకరమైన జీవితం కంటే మరణమే మేలు’.. అని సూసైడ్‌ నోట్‌లో రాసి ఆత్మహత్య చేసుకున్నారు ఒకప్పటి ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కిషన్‌చంద్. కారణం.. ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీలో అమాయకులపై జరిగిన అకృత్యాలకు తాను కూడా బాధ్యుడినే అన్న పశ్చాత్తాపం..! ఎమర్జెన్సీని ఎత్తేసిన ఏడాది తరువాత.. ఆనాటి పరిస్థితులను గుర్తుచేసుకుని మరీ ఆత్మహత్య చేసుకున్నారంటే ఎన్నెన్ని అకృత్యాలు జరిగి ఉండాలి. ఎమర్జెన్సీ పేరుతో ఎన్నో అత్యాచారాలు జరిగాయంటారు ఆనాటి ప్రత్యక్షసాక్షులు. కనీసం కోటి మందికిపైగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేశారు. ఆ సర్జరీలు ఫెయిలై వందల మంది చనిపోయారు. ఇక పోలీస్‌ కస్టడీలో, తుర్క్‌మన్‌ గేట్‌ వద్ద కాల్పుల్లో, పలు నిరసనల్లో సుమారు వెయ్యి మంది మరణించారు. లక్షా 10వేల మందిని అరెస్ట్ చేశారు. ఇది కరెక్ట్‌ కాదని తీర్పు ఇచ్చినందుకు 16 మంది హైకోర్టు జడ్జిలకు ట్రాన్స్‌ఫర్లు. 635 రోజుల పాటు అరాచకం రాజ్యమేలింది ఆనాడు. కాని, ఈ విషయాలేవీ ఆనాడు రేడియోల్లో చెప్పలేదు, పేపర్లు రాయలేదు. అంతటి నిర్భందం. జవహర్‌లాల్ నెహ్రూ, లాల్‌బహదూర్ శాస్త్రి కంటే ఇందిరాగాంధీనే ఎక్కువగా ఆరాధించిన ప్రజలపై ఎందుకని ఎమర్జెన్సీ ప్రకటించారు? ఏ పరిస్థితుల్లో ఎమర్జెన్సీ ప్రకటించాల్సి వచ్చింది? 1975 జూన్‌ 25 తరువాత ఏం జరిగింది? తెలుసుకుందాం. 1975 జూన్ 25న ఏం జరిగిందో కాసేపు పక్కనపెడదాం. జూన్‌ 26న ఏం జరిగిందో చెప్పుకుందాం. అప్పట్లో దేశమంతా టీవీల్లేవుగా.. విషయం ఏదైనా రేడియోల్లోనే చెప్పేవాళ్లు. జూన్‌ 26న ఉదయం...

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి