Terrorists: జమ్మూ-కశ్మీర్లో ఉగ్రవాదుల మెరుపుదాడి.. కొనసాగుతున్న ఎదురుకాల్పులు
జమ్మూకశ్మీర్ పూంచ్ జిల్లాలో భారత సైన్యం ట్రక్కుపై ఉగ్రదాడి జరిగింది. ఉగ్రవాదుల దాడిలో పలువురు ఆర్మీ సిబ్బంది గాయపడినట్లు సమాచారం. దాడి జరిగిన ప్రాంతానికి సమీపంలో సైన్యం యాంటీ టెర్రరిస్ట్ ఆపరేషన్ కూడా జరుగుతోందని తెలుస్తోంది. సురన్‌కోట్ తహసీల్‌లోని బఫ్లియాజ్ పోలీస్ స్టేషన్ మండి రోడ్డు సమీపంలో ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడ్డారు.
జమ్మూకశ్మీర్ పూంచ్ జిల్లాలో భారత సైన్యం ట్రక్కుపై ఉగ్రదాడి జరిగింది. ఉగ్రవాదుల దాడిలో పలువురు ఆర్మీ సిబ్బంది గాయపడినట్లు సమాచారం. దాడి జరిగిన ప్రాంతానికి సమీపంలో సైన్యం యాంటీ టెర్రరిస్ట్ ఆపరేషన్ కూడా జరుగుతోందని తెలుస్తోంది. సురన్‌కోట్ తహసీల్‌లోని బఫ్లియాజ్ పోలీస్ స్టేషన్ మండి రోడ్డు సమీపంలో ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడ్డారు. ఉగ్రవాదుల కాల్పుల్లో పలువురు జవాన్లు గాయపడ్డారని, ఆ తర్వాత భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య కాల్పులు కొనసాగుతున్నాయని చెప్పారు మిలటరీ అధికారులు. ఈ పరస్పర దాడుల్లో ముగ్గురు జవాన్లు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. ఉగ్రవాదుల ఆచూకీ కోసం భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయి.
సమాచారం ప్రకారం, పూంచ్‌లోని సురన్‌కోట్ ప్రాంతంలోని డేరా కి గాలీ (డికెజి) వద్ద ఆర్మీ ట్రక్కుపై మెరుపుదాడి జరిగింది. గత నెలలో, రాజౌరీలోని కలకోట్‌లో భారత సైన్యం ప్రత్యేక దళాలు నిర్వహించిన యాంటీ టెర్రర్ ఆపరేషన్‌లో ఇద్దరు కెప్టెన్‌లతో సహా పలువురు సైనికులు మరణించిన విషాద సంఘటనకు అనుబంధ ఘటనగా చెబుతున్నారు.
ఈ ప్రాంతం దురదృష్టవశాత్తూ తీవ్రవాద కార్యకలాపాలకు కేంద్ర బిందువుగా మారింది. ఈ మధ్యకాలంలో మన సైన్యంపై గణనీయమైన దాడులు జరుగుతున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్, మే మధ్య రాజౌరీ-పూంచ్ ప్రాంతంలో రెండు వేర్వేరు దాడుల్లో 10 మంది సైనికులు విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రాంతం 2021, 2003 మధ్య కాలంలో తీవ్రవాదం నుండి విముక్తి పొందిందినట్లు బలగాలు చెబుతున్నాయి. ఇదిలా ఉంటే.. గత రెండేళ్లలో ఈ ప్రాంతంలో ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాల్లో 35 మందికి పైగా సైనికులు ప్రాణాలు కోల్పోయారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..