శ్రీరామ మందిరంలోని 400 ఏళ్ల నాటి విగ్రహాలు మాయమడంతో ఆలయ పుజారిపై ఆగ్రా పోలీసులు కేసు నమోదు చేశారు. ఆగ్రాలోని జాత్‌పురా ప్రాంతంలోని శ్రీరామ మందిరంలోని నాలుగు విగ్రహాలు మాయమయ్యాయి. దీంతో ఆలయ నిర్వాహక కమిటీ సభ్యలు.. ఆలయ పూజారి, అతని భార్యపై అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ మేనేజనర్ రాందాస్ కటారా మాట్లాడుతూ ఈ శ్రీరామ మందిరాన్ని మొఘల్ చక్రవర్తి అక్బర్ ఆస్థానంలోని మంత్రి రాజా తోడర్మల్ నిర్మించారని, అలాగే విలువైన లోహాలతో చేసిన శ్రీసీతారామలక్ష్మణ అంజనేయుల విగ్రహాలను ప్రతిష్టించారని తెలిపారు.
అలాగే విగ్రహాలు మాయమైన విషయం గురించి అడిగితే ఆలయ పూజారి, ఆయన భార్య తమతో అనుచితంగా ప్రవర్తించారని రాందాస్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇంకా ఆలయ భూములను ఆక్రమించడానికి ప్రయత్నిస్తున్నవారి మద్ధతుతో తమను బెదిరించారని ఆయన పోలీసులకు తెలిపారు.
ఆలయ కమిటీ ఫిర్యాదు మేరకు ఆలయ పూజారి ఆచార్య దీప్మణి శుక్లా, ఆయన భార్యపై ఐపీసీ 379, సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని, విగ్రహాల ఆచూకీ కనుగొనేందుకు ఆరా తీస్తున్నామని స్థానిక పోలీస్ స్టేషన్‌లోని ఏసీపీ గిరీష్ కుమార్ వెల్లడించారు. కాగా, ఆలయ కమిటీ తనపై కుట్ర చేస్తుందని, విగ్రహాల దొంగతనం మోపుతూ చేస్తున్న ఆరోపణలు కొట్టివేశారు పూజారి శుక్లా.
మరిన్ని జాతీయ వార్తల కోసం