Manipur Violence: మణిపూర్‌లో మళ్లీ చెలరేగిన అల్లర్లు.. అప్పటి వరకూ ఇంటర్నెట్‌ బంద్‌!

మణిపూర్‌లో మరోమారు అల్లర్లు చెలరేగాయి. సోమవారం రాత్రి సెరౌ ప్రాంతంలో శాంతిభద్రతలు నెలకొల్పడానికి అస్సాం రైఫిల్స్, బీఎస్‌ఎఫ్‌, పోలీస్‌ బలగాలు పెద్ద సంఖ్యలో మోహరించాయి. ఆ సమయంలో భద్రతా దళాలు, నిరసనకారుల మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో..

Manipur Violence: మణిపూర్‌లో మళ్లీ చెలరేగిన అల్లర్లు.. అప్పటి వరకూ ఇంటర్నెట్‌ బంద్‌!
Manipur Violence
Follow us
Srilakshmi C

|

Updated on: Jun 06, 2023 | 3:53 PM

ఇంఫాల్‌: మణిపూర్‌లో మరోమారు అల్లర్లు చెలరేగాయి. సోమవారం రాత్రి సెరౌ ప్రాంతంలో శాంతిభద్రతలు నెలకొల్పడానికి అస్సాం రైఫిల్స్, బీఎస్‌ఎఫ్‌, పోలీస్‌ బలగాలు పెద్ద సంఖ్యలో మోహరించాయి. ఆ సమయంలో భద్రతా దళాలు, నిరసనకారుల మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఇద్దరు అస్సాం రైఫిల్స్ సిబ్బందికి బుల్లెట్ గాయాలవగా, ఒక బీఎస్‌ఎఫ్‌ జవాన్‌ మృతి చెందినట్లు ఆర్మీ అధికారులు తెలిపారు. గాయపడిన అస్సాం రైఫిల్స్ సిబ్బందిని మంత్రిపుఖ్రీకి తరలించినట్లు మీడియాకు తెలిపారు. మణిపూర్‌లోని సెరు, సుగ్నూ ప్రాంతంలో జూన్ 5 అర్ధ రాత్రి సమయంలో తిరుగుబాటుదారులు, భద్రతా దళాల మధ్య కాల్పులు జరిగాయి. ఈ దాడులను భద్రతా బలగాలు తిప్పికొట్టాయి.

ప్రస్తుతం ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. శనివారం నుంచి మణిపూర్‌లోని కొండలు, లోయ ప్రాంతాల్లో ఏరియా డామినేషన్ కార్యకలాపాలను ఆర్మీ, అస్సాం రైఫిల్స్, పోలీసులు ప్రారంభించారని భద్రతను పర్యవేక్షిస్తున్న సైన్యానికి చెందిన స్పియర్‌ కోర్‌ కమాండ్‌ తెలిపింది. అల్లర్ల దృష్ట్యా మణిపూర్‌లో ఇంటర్నెట్ బ్యాన్‌ను జూన్ 10 వరకు పొడిగిస్తున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.

ఇవి కూడా చదవండి

కాగా మే 3న ఎస్టీ హోదా కోసం ఇంఫాల్‌ లోయలో మైతీలు, కుకీల మధ్య ఆధిపత్య పోరు ప్రారంభమైన సంగతి తెలిసిందే. మెయిటీలను ఎస్టీలుగా పరిగణించాలని ఏప్రిల్ 19న మణిపూర్‌ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. అందుకు నిరసనగా ఆల్ ట్రైబల్స్ స్టూడెంట్స్ యూనియన్ (ATSU) నిర్వహించిన ర్యాలీ క్రమంగా హింసాత్మక రూపం దాల్చింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.