“శివోహం” అంటున్న లాలు తనయుడు తేజ్ ప్రతాప్..
బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ తనయుడు.. తేజ్ ప్రతాప్ మరోసారి దేవుళ్ల వేషధారణతో ప్రత్యక్షమయ్యాడు. గతంలో అ అనేక సార్లు సామాజిక మాధ్యమాల్లో తేజ్ ప్రతాప్‌కు సంబంధించిన ఫోటోలు వైరల్ అయ్యాయి. అయితే తాజాగా ఆయన శివుడి రూపాన్ని పోలిన విధంగా వస్త్రాదరణలో పాట్నాలోని ఓ ఆలయంలో పూజలు చేపట్టారు. శరీరం నిండా విభూది రాసుకుని, మెడలో రుద్రాక్ష మాల వేసుకుని ఆ ఫోటోలో కనిపించారు. అంతేకాకుండా నడుముకి పులిచర్మాన్ని పోలిన ఓ వస్త్రాన్ని కూడా […]

బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ తనయుడు.. తేజ్ ప్రతాప్ మరోసారి దేవుళ్ల వేషధారణతో ప్రత్యక్షమయ్యాడు. గతంలో అ అనేక సార్లు సామాజిక మాధ్యమాల్లో తేజ్ ప్రతాప్‌కు సంబంధించిన ఫోటోలు వైరల్ అయ్యాయి. అయితే తాజాగా ఆయన శివుడి రూపాన్ని పోలిన విధంగా వస్త్రాదరణలో పాట్నాలోని ఓ ఆలయంలో పూజలు చేపట్టారు. శరీరం నిండా విభూది రాసుకుని, మెడలో రుద్రాక్ష మాల వేసుకుని ఆ ఫోటోలో కనిపించారు. అంతేకాకుండా నడుముకి పులిచర్మాన్ని పోలిన ఓ వస్త్రాన్ని కూడా ధరించారు. కాగా, శివుడి వేషధారణతో పాటు.. గోవుల మధ్య మురళి వాయిస్తున్న కృష్ణుడిలా కూడా గతంలో దర్శనమిచ్చారు తేజ్ ప్రతాప్. ఇప్పుడు శివుడి వేషధారణలో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
Bihar: Lalu Prasad Yadav’s elder son, Tej Pratap Yadav, dressed as Lord Shiva, offered prayers at a temple in Patna, today. pic.twitter.com/mMjuCydClz
— ANI (@ANI) July 23, 2019



