రెండు దేశాలకు షాక్ ఇవ్వబోతున్న భారత్ – శత్రుదుర్భేద్యంగా భారత రక్షణ వ్యవస్థ
రష్యాతో S-500 ఎయిర్ డిఫెన్స్ ఒప్పందం కోసం.. భారత్ మరో అడుగు ముందుకు వేసిందన్న వార్తలు డైరెక్ట్ చైనా నుంచే అందుతున్నాయి. ఆపరేషన్ సిందూర్‌లో S-400 శక్తి సామర్థ్యాలను చూశాం. ఇప్పుడు next gen S-500 వంతు. అయితే, దానిని కొనుగోలు చేయడానికి భారత్ వేసుకున్న రోడ్ మ్యాప్‌లో కొన్ని అడ్డంకులు ఉన్నాయి. ఇక్కడ బిగ్ క్వషన్ ఏంటంటే.. భారతదేశానికి S-500 ఎందుకు అవసరం? ఈ రక్షణ వ్యవస్థ చైనా-పాకిస్తాన్ ప్రణాళికలను ఎలా భగ్నం చేయబోతోంది?

శత్రువుల స్టెల్త్ ఫైటర్ జెట్ల ముప్పునుంచి కాపాడుకోడానికి భారత్ ఒక అద్భుతమైన ప్రణాళికను రూపొందించింది. ఈ ప్రణాళిక వచ్చే 50 ఏళ్ల వరకు మన వైమానిక సరిహద్దును భద్రపరచడానికి ఎంతో ఉపయోగపడుతుంది. ఆపరేషన్ సిందూర్ సమయంలో S-400 వైమానిక రక్షణ వ్యవస్థ పాకిస్తాన్‌ను కుదిపేసింది. అప్పుడు దీనిపై విపరీతమైన చర్చ జరిగింది. ఈ విషయంలో బీజింగ్‌కు నిద్ర కరువైంది. భారతదేశం పాకిస్తాన్ నిఘా పెట్టిన AWACS విమానాన్ని దాని సొంత ఇలాఖాలో S-400 సహాయంతోనే కూల్చేశాయి మన బలగాలు. అది కూడా 314 కిలోమీటర్ల దూరం నుంచే కాల్చిపడేశాం. రష్యా ఇచ్చిన ఈ రక్షణ వ్యవస్థ శక్తిని చూసి ప్రపంచమే ఆశ్చర్యపోయింది. భారతదేశం రష్యా నుంచి ఐదు S-400 యూనిట్లను కొనుగోలు చేసింది, వాటిలో మూడు డెలివరీ అయ్యాయి. మరో రెండు త్వరలో భారత్‌కు రానున్నాయి. గత వారం, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చైనాలో జరిగిన SCO సమావేశంలో రష్యా రక్షణ మంత్రితో సమావేశం నిర్వహించారు, దీనిలో రక్షణ వ్యవస్థ గురించి కూడా చర్చ జరిగింది. జాతీయ మీడియా కథనాల ప్రకారం.. రక్షణ వ్యవస్థకు చెందిన మరికొన్ని యూనిట్లను కొనుగోలు చేయడానికి భారతదేశం చర్చలు ప్రారంభించింది. కాని.. పాక్, చైనాలు రెండో నివేదికపైనే ఎక్కువ ఆందోళనను వ్యక్తం చేస్తున్నాయి. ఎందుకంటే.. భారత్ ఇప్పుడు next gen S-400, S-500 డిఫెన్స్ సిస్టమ్స్‌ను కొనుగోలు చేయాలనుకుంటోంది. దీంతో ఆ రెండు దేశాల వెన్నులో వణుకు మొదలైంది. భారత...