- Telugu News Photo Gallery Amarnath Yatra Begins Amid Tight Security, Pilgrims Scared After Pahalgam Attack?
Amarnath Yatra 2025: కట్టుదిట్టమైన భద్రత నడుమ అమర్‌నాథ్ యాత్ర ప్రారంభం.. కాలినడకన 38 రోజులపాటు మంచులింగ దర్శనం!
అమర్ నాథ్ యాత్ర ప్రారంభమైంది. భారీ భద్రత నడుమ జమ్మూ బేస్ క్యాంప్ నుంచి అమర్‌నాథ్ యాత్రకు మొదటి బ్యాచ్ యాత్రికులు బయలుదేరారు. భగవతి నగర్ యాత్రి నివాస్‌లో పూజలు నిర్వహించి, జెండా ఊపి జమ్ముకశ్మీర్ ఎల్జీ మనోజ్ సిన్హా యాత్రను ప్రారంభించారు..
Updated on: Jul 02, 2025 | 8:10 PM

అమర్ నాథ్ యాత్ర ప్రారంభమైంది. భారీ భద్రత నడుమ జమ్మూ బేస్ క్యాంప్ నుంచి అమర్‌నాథ్ యాత్రకు మొదటి బ్యాచ్ యాత్రికులు బయలుదేరారు. భగవతి నగర్ యాత్రి నివాస్‌లో పూజలు నిర్వహించి, జెండా ఊపి జమ్ముకశ్మీర్ ఎల్జీ మనోజ్ సిన్హా యాత్రను ప్రారంభించారు.

పహల్గామ్, బాల్తాల్ మార్గాల ద్వారా 38 రోజుల పాటు అమర్ నాథ్ యాత్ర జరగనుంది. ఇప్పటివరకు అమర్ నాథ్ యాత్రకు దాదాపు 3.5 లక్షల మంది యాత్రికులు రిజిస్టర్ చేసుకున్నారు. మరోవైపు పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో అమర్ నాథ్ యాత్రకు కేంద్రం భారీ భద్రత కల్పించింది.

అమర్ యాత్రకు కావలసినంత భద్రత ఉంది.. భయం లేదని, ఆహారం, వసతి, పారిశుధ్యం, అన్ని సౌకర్యాలు చాలా బాగున్నాయని భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

నేటి నుంచి యాత్ర ప్రారంభమవడంతో బాబా అమర్‌నాథ్ దర్శనం కోసం వేలాది మంది భక్తులు తరలి వస్తున్నారు. రెండు నెలల క్రితం ఇక్కడ భిన్నమైన వాతావరణం ఉంది.

కానీ నేడు భక్తులు బాబా భోలే నినాదాలతో ఆ ప్రాంతమంతా ఆధ్యాత్మికతతో నిండిపోయింది. ప్రజలు తాము సురక్షితమైన చేతుల్లోనే ఉన్నారని నమ్ముతున్నారని జమ్మూకాశ్మీర్ బీజేపీ అధ్యక్షుడు సత్ శర్మ అన్నారు.




