మాస్కులేవీ ? ఎంజాయ్ మూడ్ లో రాజస్తాన్ మహిళా ఎమ్మెల్యేలు !

రాజస్థాన్ రాజకీయ సంక్షోభం మాటేమో గానీ సీఎం అశోక్ గెహ్లాట్ వర్గంలోని ఎమ్మెల్యేలంతా ఫైవ్ స్టార్ హోటళ్లలో రాచభోగాలు అనుభవిస్తున్నారు. తాజాగా సుమారు 13 మంది మహిళా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు..

మాస్కులేవీ ? ఎంజాయ్ మూడ్ లో  రాజస్తాన్ మహిళా ఎమ్మెల్యేలు !

రాజస్థాన్ రాజకీయ సంక్షోభం మాటేమో గానీ సీఎం అశోక్ గెహ్లాట్ వర్గంలోని ఎమ్మెల్యేలంతా ఫైవ్ స్టార్ హోటళ్లలో రాచభోగాలు అనుభవిస్తున్నారు. తాజాగా సుమారు 13 మంది మహిళా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు జైసల్మీర్ లోని ఓ హోటల్లో ‘తీజ్ ఫెస్టివల్’ సందర్భంగా చేతులకు మెహందీ పెట్టుకుంటూ కెమెరాకు చిక్కారు. వీరిలో ఒక్కరైనా ముఖాలకు మాస్క్ ధరిస్తే ఒట్టు ! వీళ్లంతా గెహ్లాట్ మద్దతుదారులే….. అసమ్మతి నేత సచిన్ పైలట్, ఆయనకు సపోర్ట్ పలుకుతున్న 18 మంది రెబెల్ ఎమ్మెల్యేల విషయం తెలియదు గానీ గెహ్లాట్ వర్గ శాసన సభ్యులు  మాత్రం సుమారు నెల రోజులుగా లగ్జరీ హోటళ్లలో సేద దీరుతున్నారు. సినిమాలు చూస్తూ, అంత్యాక్షరి పాటలు పాడుకుంటూ, యోగాసనాలు వేస్తూ వీడియోల్లో కనబడుతున్నారు. మరి శాసనసభ  ఈ నెల 14 నుంచి సమావేశమైతే వీరి రాచభోగాలకు బ్రేక్ పడినట్టే !

 

 

Click on your DTH Provider to Add TV9 Telugu