ఆ రాష్ట్రంలో వెయ్యికి పైగా ప్రాంతాల పేర్లు మార్పు… కారణమిదే!
తమిళనాడు ప్రభుత్వం త్వరలోనే వెయ్యి ప్రాంతాల పేర్లను మార్చబోతోంది. తాజాగా 1,018 ప్రాంతాల పేర్లను తమిళ ఉచ్ఛారణకు తగ్గట్టు ఇంగ్లీషులో మార్చాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే దీనికి సంబంధించి ఓ అత్యన్నత స్థాయి కమిటీని...

తమిళనాడు ప్రభుత్వం త్వరలోనే వెయ్యి ప్రాంతాల పేర్లను మార్చబోతోంది. తాజాగా 1,018 ప్రాంతాల పేర్లను తమిళ ఉచ్ఛారణకు తగ్గట్టు ఇంగ్లీషులో మార్చాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే దీనికి సంబంధించి ఓ అత్యన్నత స్థాయి కమిటీని నియమించింది. ఆ కమిటీ సభ్యులు ఇచ్చిన ప్రతిపాదనల మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా పలు ప్రముఖ ప్రాంతాల్లోని పేర్లు ఇకపై విభిన్నంగా ఉండబోతున్నాయి. ఈ మేరకు జిల్లా కలెక్టర్లకు సీఎం పళని స్వామి ఆదేశాలు జారీ చేశారు. కాగా 1979లో తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్న ఎంజీ రామచంద్రన్.. అప్పట్లో కొన్ని కులాల పేరిట ఉన్న వీధులు, కూడళ్ల పేర్లను మార్చారు. ఆ తర్వాత ఇప్పుడే పెద్ద స్థాయిలో ప్రాంతాల పేర్లను మార్చబోతోంది తమిళనాడు ప్రభుత్వం.
కొన్ని పేర్లు ఇలా..
– తొండియార్ పేట – తాండవయ్యార్‌పేట్టాయ్ – పురసవాల్కమ్ – పురసైవాక్కమ్ – టుటికోరీన్ – తూతుకుడి – ట్రిప్లికేన్ – తిరువల్లికేని – వేపెరి – వేప్పెరి – పెరంబుర్ – పెరంబూర్ – తిరుచ్చి – తిరుచిరాపల్లి
ఇలా రాష్ట్రంలోని పల్లెలు, పట్టణాల్లోని పేర్లు ఇకపై తమిళ ఉచ్ఛారణకు తగ్గట్టుగా ఇంగ్లీష్‌లో పేర్లు మారిపోనున్నాయి.



