Tamilnadu Rains: ఈశాన్య పవనాల ఎఫెక్ట్.. తమిళనాడులో భారీ వర్షాలు.. ఏడు జిల్లాల్లో స్కూల్స్ కు సెలవు.. ఆరంజ్ అలెర్ట్ జారీ

|

Nov 01, 2022 | 8:50 AM

చెన్నైతో పాటు కాంచీపురం, తిరువళ్లూరు, చెంగళపట్టు జిల్లాల్లో బుధవారం వరకు భారీ వర్షాలు కురుస్తాయని ప్రాంతీయ వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆరంజ్ అలెర్ట్ జారీ చేసింది.ఈ నేపథ్యంలో ఏడు జిల్లాలలో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు

Tamilnadu Rains: ఈశాన్య పవనాల ఎఫెక్ట్.. తమిళనాడులో భారీ వర్షాలు.. ఏడు జిల్లాల్లో స్కూల్స్ కు సెలవు.. ఆరంజ్ అలెర్ట్ జారీ
Tamilandu Rains
Follow us on

దక్షిణ భారతదేశంలో అక్టోబర్ 29న ఈశాన్య రుతుపవనాల అడుగుపెట్టాయి. దీంతో తమిళనాడులోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. చెన్నై శివారులో కురిసిన భారీ వర్షాలకు అనేక ప్రాంతాలు నీట మునిగాయి. ఉత్తర శ్రీలంక తీరం వెంబడి నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి ఏర్పడింది. ఈశాన్య రుతుపవనాల వర్షాల కారణంగా రానున్న ఐదు రోజుల పాటు తమిళనాడు, పుదుచ్చేరిలో వర్షాలు కురిసే అవకాశం ఉందని చెన్నై వాతావరణ కేంద్రం తెలిపింది. చెన్నైతో పాటు కాంచీపురం, తిరువళ్లూరు, చెంగళపట్టు జిల్లాల్లో బుధవారం వరకు భారీ వర్షాలు కురుస్తాయని ప్రాంతీయ వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆరంజ్ అలెర్ట్ జారీ చేసింది.ఈ నేపథ్యంలో ఏడు జిల్లాలలో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు అధికారులు. చెన్నై సహా పొరుగు జిల్లాలైన కాంచీపురం, తిరువళ్లూరు, చెంగల్పట్టులోని పాఠశాలలకు మంగళవారం సెలవు ప్రకటించారు.

చెన్నై లో మంగళవారం ఉదయం 5:00 గంటలకు తిరువల్లూరు, చెన్నై, మైలదుత్తురై, నాగపట్నం, తిరువారూర్ సహా రాష్ట్రలో పలు జిల్లాలు,  కారైకాల్ ప్రాంతంలో వచ్చే మూడు గంటల్లో ఉరుములు ..  మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని ప్రాంతీయ వాతావరణ కేంద్రం అంచనా వేసింది.

తమిళనాడులోని కాంచీపురం, చెంగల్‌పట్టు, విల్లుపురం, కడలూరు, తంజావూరు, పుదుకోట్టై, శివగంగై, రామనాథపురం, తూత్తుకుడి, తెంకాసి, తిరునెల్వేలి, కన్యాకుమారి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

కాంచీపురం, తిరువళ్లూరులో సోమవారం సాయంత్రం ఎల్లో అలెర్ట్ జారీ చేశారు. ఈ ప్రాంతాల్లో రానున్న రెండు రోజులు పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. చెన్నై, ఈరోడ్, సేలం, కాంచీపురం చుట్టుపక్కల అనేక ప్రాంతాల్లో స్ట్రామ్‌వాటర్ డ్రెయిన్ పనులు ఇంకా పూర్తి కాలేదని

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..