
Tamil Nadu News: అతనో మర్డర్ కేసులో నిందితుడిగా ఉన్నాడు.. ఇటీవలనే బెయిల్ పై బయటకు వచ్చాడు.. ఈ క్రమంలో పోలీస్ స్టేషన్ కు వచ్చి సంతకం పెట్టి.. మళ్లీ పయనమయ్యాడు.. అయితే, అతను వెళ్తున్న మార్గంలో కాపు కాసిన కొందరు వ్యక్తులు.. అతన్ని ఒక్కసారిగా చుట్టుముట్టారు. వారి చేతుల్లో ఉన్న కత్తులతో వెంటపడ్డారు.. బాధితుడు కొంచెం దూరం పరిగెత్తి కిందపడ్డాడు.. దీంతో అతన్ని చుట్టుముట్టిన ఐదారుగురు.. దారుణంగా చంపారు. అనంతరం అక్కడి నుంచి కారులో పరారయ్యారు. ఈ దారుణ ఘటన తమిళనాడులోని కారైకుడి జిల్లాలో చోటుచేసుకుంది. పట్టపగలు అందరూ చూస్తుండగానే, నడిరోడ్డుపై ఒక వ్యక్తిని వేటాడి వెంటాడి చంపేశారు. పరిగెత్తుతున్న వ్యక్తిని ఐదుగురు దారుణంగా హత్య చేశారు. ఈ హత్యకు సంబంధించిన వీడియో సీసీ కెమెరాల్లో రికార్డైంది. తీవ్రగాయాలైన బాధితుడిని ఆస్పత్రికి తరలించేలోపే మార్గం మధ్యలో మరణించాడు.
తమిళనాడులోని కారైకుడి జిల్లాలో ఆదివారం ఈ హత్య జరిగినట్లు పోలీసులు తెలిపారు.. బాధితుడు మధురై వాసి అరివళగన్ అలియాస్ వినీత్ (29 ) గా గుర్తించారు. హత్య కేసులో సంబంధం ఉన్న అతడిని పోలీసులు సంతకం చేసేందుకు పిలిచారని.. ఈ సమయంలో అతన్ని చుట్టుముట్టి కత్తులతో దాడి చేసి చంపినట్లు తెలిపారు.
రోడ్డుపై వెళ్తున్న సమయంలో కారులో వచ్చిన దుండగులు వినీత్ ను చుట్టుముట్టారు. తప్పించుకునే ప్రయత్నంలో వినీత్ పరిగెత్తి కిందపడ్డాడు. అనంతరం కత్తులతో చుట్టుముట్టి నరికి చంపారు. అయితే, వినీత్ కు చెందిన మరో వ్యక్తి కూడా వచ్చినప్పటికీ.. నిందితులను అడ్డుకోలేకపోయాడు. కాగా.. ఈఘటన స్థానికంగా కలకలం రేపింది.
பட்ட பகல்ல இப்புடி ஓட விட்டு வெட்டுறானுங்க ?
காவல்துறை இவனுங்களா புடிச்சு, கையி கால உடைச்சு விட்டாதான் திருந்துவானுங்க #karaikudi pic.twitter.com/899RNYK5PH
— Name cannot be blank (@Naju_Here) June 18, 2023
మరిన్ని జాతీయ వార్తల కోసం..