Tamil Nadu Government: తమిళనాడు ముఖ్యమంత్రి కీలక నిర్ణయం.. వారిపై ఉన్న కేసులు ఎత్తివేస్తున్నట్లు ప్రకటన

Tamil Nadu Government: పౌరసత్వ సవరణ చట్టానికి (సీఏఏ) వ్యతిరేకంగా ఆందోళనకు దిగిన వారిపై నమోదు చేసిన కేసులు, అలాగే కరోనా సమయంలో లాక్‌డౌన్‌ ఉల్లంఘనలకు పాల్పడిన...

Tamil Nadu Government: తమిళనాడు ముఖ్యమంత్రి కీలక నిర్ణయం.. వారిపై ఉన్న కేసులు ఎత్తివేస్తున్నట్లు ప్రకటన
Follow us

|

Updated on: Feb 19, 2021 | 7:36 PM

Tamil Nadu Government: పౌరసత్వ సవరణ చట్టానికి (సీఏఏ) వ్యతిరేకంగా ఆందోళనకు దిగిన వారిపై నమోదు చేసిన కేసులు, అలాగే కరోనా సమయంలో లాక్‌డౌన్‌ ఉల్లంఘనలకు పాల్పడిన వారిపై పెట్టిన కేసులను ఉపసంహరించుకుంటున్నట్లు తమిళాడు ముఖ్యమంత్రి పళనిస్వామి శుక్రవారం వెల్లడించారు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.

పౌరసత్వ సవరణ చట్టం ఆమోదంపై కొన్ని సంస్థలు రాష్ట్రంలోని పలు చోట్ల నిరసనలకు దిగాయని పళనిస్వామి అన్నారు. అయితే ప్రజా ఆస్తుల ధ్వంసానికి పాల్పడిన వారిపై పెట్టిన కేసులు మినహా, పోలీసులను అడ్డుకోవడం, హింసకు పాల్పడినట్లు నమోదైన కేసులన్నింటిని ఉపసంహరించుకుంటున్నామని స్పష్టం చేశారు. కరోనా వైరస్ లాక్‌డౌన్‌ సమయంలో హింసకు దిగడం, అక్రమంగా ఇ-పాస్‌లు పొందడం, పోలీసులను తమ విధులను నిర్వహించకుండా అడ్డుకున్న వారిపై పెట్టిన కేసులను ఉపసంహరించుకుంటున్నట్లు చెప్పారు.

కాగా, 2020 మార్చి 25న లాక్‌డౌన్‌ విధించినప్పటి నుంచి తమిళనాడు పబ్లిక్‌ హెల్త్‌ యాక్ట్‌ 1939, ఎపిడిమిక్‌ డిసీజెస్‌ 1937 ఉల్లంఘన కింద సుమారు 10 లక్షల కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. షెడ్యూల్‌ ప్రకారం ఈ ఏడాది ఏప్రిల్‌లో అసెంబ్లీ ఎన్నికలు ఉండటం, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా అన్నాడీఎంకే ప్రచారం ప్రారంభించడం మూలంగా సీఎం పళనిస్వామి ఈ ప్రకటన చేశారు.

RBI Rap Song: ఆర్థిక మోసాలపై ఆర్బీఐ వినూత్న అవగాహన.. వీడియో సాంగ్‌ విడుదల.. సోషల్‌ మీడియాలో వైరల్‌

దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?