CM Stalin: సీఎం అంటే ఇలా ఉండాలంటున్న జనాలు.. ఆయన చేసిన ఈ ఒక్కపనితో..

|

Jul 01, 2022 | 7:50 AM

CM Stalin: ఒకే ఒక్కడు సినిమాలో ముఖ్యమంత్రి పాత్రలో ఉండే హీరో అర్జున్‌ నిర్లక్ష్యంగా వ్యవహరించే ప్రభుత్వ ఉద్యోగులను అప్పటికప్పుడు సస్పెండ్ చేసే సన్నివేశం అందరికీ గుర్తుండే ఉంటుంది. అయితే...

CM Stalin: సీఎం అంటే ఇలా ఉండాలంటున్న జనాలు.. ఆయన చేసిన ఈ ఒక్కపనితో..
Cm Stalin
Follow us on

CM Stalin: ఒకే ఒక్కడు సినిమాలో ముఖ్యమంత్రి పాత్రలో ఉండే హీరో అర్జున్‌ నిర్లక్ష్యంగా వ్యవహరించే ప్రభుత్వ ఉద్యోగులను అప్పటికప్పుడు సస్పెండ్ చేసే సన్నివేశం అందరికీ గుర్తుండే ఉంటుంది. అయితే నిజ జీవితంలో ఇలాంటి డేరింగ్ నిర్ణయాలు తీసుకోగలరా అంటే కచ్చితంగా అవునని సమాధానం మాత్రం చెప్పలేము. అయితే తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ మాత్రం ఇలాగే వ్యవహరించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ స్టైలే వేరు. ఆయన ఏం చేసినా డిఫరెంట్‌గానే ఉంటుంది. ముఖ్యమంత్రి హోదాలో ఉన్నా, సామాన్యంగా కనిపించే స్టాలిన్‌ చర్యలు కూడా అంతే నార్మల్‌గా ఉంటాయి.

ప్రజల నుంచి ఏ చిన్న ఫిర్యాదు వచ్చినా అక్కడ వాలిపోతూ ఉంటారు. సడన్‌ విజిట్స్‌, ఆకస్మిక తనిఖీలతో షాక్ ఇవ్వడం ఆయన స్టైల్‌. ఓ అనాథ బాలల పాఠశాల నుంచి ఫిర్యాదు రావడంతో సడన్‌ విజిట్ చేశారు. రాణిపేట జిల్లా పర్యాటనలో భాగంగా స్టాలిన్‌ గురువారం అక్కడి ప్రభుత్వ పాఠశాలతో పాటు హాస్టల్‌లో ఆకస్మిక తనిఖీలు చేశారు. సీఎం వెళ్లేసరికి ఒక్కరు కూడా విధులకు హాజరుకాకపోవడంతో అక్కడే అరగంటపాటు ఎదురు చూశారు. విధులకు రావాల్సిన టైమ్‌ దాటిపోయినా ఎవ్వరూ రాకపోవడంతో ముఖ్యమంత్రి సీరియస్‌ అయ్యారు. ప్రభుత్వ పాఠశాల, హాస్టల్‌ సిబ్బంది నిర్లక్ష్యంపై మండిపడ్డారు.

అక్కడి విద్యార్ధుల నుంచి సమాచారం అడిగి తెలుసుకున్న ముఖ్యమంత్రి స్టాలిన్‌, మొత్తం సిబ్బందిని సస్పెండ్‌ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. టీచర్స్‌ టైమ్‌కు రావడం లేదని, హాస్టల్‌లో సరైన వసతుల్లేవని, భోజనం సరిగా ఉండటం లేదని స్టూడెంట్స్‌ కంప్లైంట్ చేయడంతో, చర్యలకు ఆదేశించారు. ఎక్కువగా సాధారణ ప్రజానీకంతో కలిసిపోయే స్టాలిన్‌, తన పాలనలోనూ కామన్‌ పీపుల్‌కే పెద్దపీట వేస్తుంటారు. అందులో భాగంగానే ప్రభుత్వ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీచేసి షాకిచ్చారు. దీంతో ఈ విషయం తెలుసుకున్న ప్రజలు ఇలా కఠినంగా వ్యవహరిస్తేనే ప్రజలకు సరైన సేవలు అందుతాయంటూ ముఖ్యమంత్రిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..