8 ఏళ్ల బాలుడు ఇంటికి వెళ్తుండగా.. కదులుతూ కనిపించిన పొదలు.. కేకలు వేయడంతో..
తమిళనాడులో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. సోమవారం కోయంబత్తూరు జిల్లా వాల్పారైలో సాయంత్రం పాలు తీసుకురావడానికి వెళ్లిన ఒక 8 ఏళ్ల బాలుడిపై ఎగుబంటి దాడి చేసింది. బాలుడిని పొదల్లోకి లాక్కెళ్లి శరీరభాగాలను పీక్కుతింది. బాలుడి తిరిగిరాకపోవడంతో తల్లిదండ్రులు వెళ్లి చూడగా ఈ దారుణం బయటపడింది.

పాల కోసం టీ ఎస్టేట్ నుంచి ఇంటికి వెళ్లిన ఎనిమిదేళ్ల బాలుడిపై ఎగులుబంటి దాడి చేసి హత్య చేసిన ఘటన తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరు జిల్లా వాల్పారైలో వెలుగు చూసింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. అస్సాం నుంచి వలస వచ్చిన ఒక కుటుంబం స్థానిక టీ ఎస్టేట్‌లో కూలీలుగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ దంపతులకు నూర్-ఉల్-హక్ అనే 8 ఏళ్ల కుమారుడు ఉన్నారు. అయితే తల్లిదండ్రులు టీ ఎస్టేట్‌లో పనిచేస్తుండగా సోమవారం సాయంత్రం బాలుడు పాలు తీసుకురావడానికి సమీపంలోని ఇంటికి వెళ్లాడు.. ఈ క్రమంలో దారి తప్పి అటుగా వచ్చిన ఒక ఎలుగుబండి బాలుడిని చూసి అతనిపై దాడి చేసింది. తర్వాత బాలుడిని పొదల్లొకి ఈడ్చుకెళ్లి అతని శరీర భాగాలను పీక్కుతింది. దీంతో బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు.
అయితే పాల కోసం ఇంటికి వెళ్లిన బాలుడు ఇంకా తిరిగి రాకపోవడంతో అనుమానం వచ్చిన తల్లిదండ్రులు.. చుట్టుపక్కల ప్రాంతాలను మొత్తం వెతికారు. అలానే ఇంటికెళ్లే మార్గాన్ని కూడా తనిఖీ చేశారు. ఈ క్రమంలోనే దారిలో పాలు చల్లిపోయి ఉండడం, రక్తపు మరకలను గమనించారు. ఆ రక్తపు మరకల గుండా వెళ్లి ఇతర కార్మికుల సహాయంతో బాలుడి కోసం వెతికారు. కాస్తా దూరం వెళ్లాక అక్కడ బాలుడి మృతదేహం కనిపించింది. దీంతో ఒక్కసారిగా షాక్ అయ్యారు.
సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు, పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. బాలుడిపై ఎలుగుబంటి దాడి చేసినట్టు నిర్ధారించారు. బాలుడి ఒక కన్ను, ముఖ భాగం, మెదడులోని కొంతభాగాన్ని ఎలుగుబంటి కొరుక్కు తిన్నట్లు అధికారులు గుర్తించారు. ఆ తర్వాత మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్ట్‌మార్టం నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




