ప్రభుత్వ ఉద్యోగం కావాలంటే ఆ భాష తప్పనిసరి… మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు
తమిళనాట త్రిభాషా విధానంపై తీవ్ర వివాదం నెలకొన్న సమయంలో మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్ సంచలన తీర్పు వెల్లడించింది. ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరేవాళ్లు తమిళం తప్పనిసరిగా నేర్చుకోవాలని స్పష్టం చేసింది. తమిళ భాషలో నిర్వహించిన పరీక్షలో ఫేయిల్ కావడంతో తనను తమిళనాడు ఎలక్ట్రిసిటీ బోర్డు (TNEB) ఉద్యోగం నుంచి తొలగించిందని ఆరోపిస్తూ ఎం.జయకుమార్ అనే వ్యక్తి వేసిన పిటిషన్‌ను మద్రాసు హైకోర్టు కొట్టేసింది. తమిళనాడులో ప్రభుత్వ ఉద్యోగాల కోసం దరఖాస్తు

తమిళనాట త్రిభాషా విధానంపై తీవ్ర వివాదం నెలకొన్న సమయంలో మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్ సంచలన తీర్పు వెల్లడించింది. ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరేవాళ్లు తమిళం తప్పనిసరిగా నేర్చుకోవాలని స్పష్టం చేసింది. తమిళ భాషలో నిర్వహించిన పరీక్షలో ఫేయిల్ కావడంతో తనను తమిళనాడు ఎలక్ట్రిసిటీ బోర్డు (TNEB) ఉద్యోగం నుంచి తొలగించిందని ఆరోపిస్తూ ఎం.జయకుమార్ అనే వ్యక్తి వేసిన పిటిషన్‌ను మద్రాసు హైకోర్టు కొట్టేసింది.
తమిళనాడులో ప్రభుత్వ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసే అభ్యర్థులు తప్పనిసరిగా తమిళం రాయడం, చదవడం నేర్చుకోవాలని మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్ పేర్కొంది. ప్రభుత్వ ఉద్యోగాలకు తమిళం తప్పనిసరి అని న్యాయస్థానం ఆదేశించింది.
త్రిభాషా విధానంపై కేంద్రం , తమిళనాడు ప్రభుత్వం మధ్య యుద్దం నడుస్తోంది. రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లో ఈ విధానాన్ని అమలు చేయబోమని సీఎం స్టాలిన్ ప్రకటించారు. హిందీని బలవంతంగా రుద్దితే సహించేది లేదన్నారు. నాగ్‌పూర్ నుంచి వచ్చే ఆదేశాలను తమిళనాడులో అమలు చేయబోమని ప్రకటించారు. కొత్త విద్యా విధానం పేరుతో హిందీని తమపై బలవంతంగా రుద్దేందుకు ఆర్‌ఎస్‌స్ కుట్ర చేసిందన్నారు. కేంద్రం బెదిరింపులకు లొంగే ప్రసక్తే లేదన్నారు.
మరోవైపు త్రిభాషా సిద్దాంతానికి వ్యతిరేకంగా డీఎంకే ఎంపీలు పార్లమెంట్ ఆవరణలో ఆందోళన చేపట్టారు. తమిళనాడును అవమానించిన కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. నల్లదుస్తులు ధరించి డీఎంకే ఎంపీలు ఆందోళన చేశారు.