AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nityananda: కైలాసంలో ఉద్యోగాలు.. ఎంపికైన అభ్యర్థులకు ఎన్నో బెనెఫిట్స్.. నిత్యానంద సంచలన ప్రకటన..

నిత్యానందస్వామి.. ఈ పేరు ఎప్పుడు విన్నా అందరికీ ఆసక్తికరమే. తమను తాము భగవంతుడి అవతారంగా చెప్పుకునే దొంగ బాబాలు అందరిలోకీ ఘటికుడుగా పేరుపొందాడు నిత్యానంద. ఆయన తీసుకునే నిర్ణయాలు, చేసే ప్రకటనలు..

Nityananda: కైలాసంలో ఉద్యోగాలు.. ఎంపికైన అభ్యర్థులకు ఎన్నో బెనెఫిట్స్.. నిత్యానంద సంచలన ప్రకటన..
Nityananda
Ganesh Mudavath
|

Updated on: Nov 15, 2022 | 7:20 AM

Share

నిత్యానందస్వామి.. ఈ పేరు ఎప్పుడు విన్నా అందరికీ ఆసక్తికరమే. తమను తాము భగవంతుడి అవతారంగా చెప్పుకునే దొంగ బాబాలు అందరిలోకీ ఘటికుడుగా పేరుపొందాడు నిత్యానంద. ఆయన తీసుకునే నిర్ణయాలు, చేసే ప్రకటనలు వివాదాస్పదంగా మారుతుంటాయి. ఈ మధ్య కాలంలో కైలాసం అనే దేశాన్ని ఏర్పాటు చేసుకున్నట్లు స్వయంగా ప్రకటించుకున్న నిత్యానంద.. ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. ఆ దేశంలో ఉద్యోగాలు ఉన్నాయని, అర్హత కలిగిన వారందరూ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇండియాలోని తమ ప్రతినిధుల సహాయంతో కైలాసంలో ఉద్యోగాలు చేయవచ్చని ఇంటర్నెట్ లో తెగ ప్రచారం చేసుకుంటున్నారు. తమ శాఖల్లో ఒక సంవత్సరం పాటు శిక్షణ పూర్తి చేసుకుని, అర్హత సాధించిన వారికి కైలాసంలో పని చేసేందుకు అవకాశం కల్పిస్తామని వెల్లడించారు. శిక్షణ సమసంలో భృతి కూడా ఇస్తున్నట్లు ప్రకటించారు. నిత్యానంద హిందూ విశ్వ విద్యాలయం, విదేశాల్లోని దేవాలయాలు, విద్యుత్తు శాఖ, గ్రంథాలయం, భారతదేశంలోని కైలాస ఆలయాలు, కైలాస రాయబార కార్యాలయం, కైలాస ఐటీ విభాగం తదితర విభాగాల్లో ఖాళీలు ఉన్నాయని వెల్లడించారు.

కాగా.. నిత్యానంద మరణంపై రోజుకో రకంగా వార్తలు వస్తున్నాయి. గతంలో నిత్యానంద చనిపోయారనే వార్త కలకలం రేపగా తాను బతికే ఉన్నానంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశాడు. భార‌త్ వ‌దిలి రెండేళ్ల క్రితం ఈక్వెడార్ కు పారిపోయాడు. ఏకంగా త‌న కైలాసం అంటూ సొంత రాజ్యాన్ని స్థాపించాడు. అంతేకాదు నిత్యానందకు సంబదించిన ప్రతి సమాచారాన్ని ‘కైలాస’ అధికారిక వెబ్‌సైట్ అందిస్తుంటుంది. ఫేస్​బుక్​లో ఫొటోలు, వీడియోలను అప్​డేట్​ చేస్తుంటుంది. ఆయన ఫొటోలు సహా, ఆయన పేపర్​పై రాస్తున్నట్లు ఉన్న చిత్రాలను షేర్​ చేసింది. ఈక్వెడార్​కు సమీపంలోని ఓ ద్వీపంలో ఉంటున్న నిత్యానంద.. కొద్దిరోజుల కిందట అనారోగ్యంతో చనిపోయినట్లు వార్తలు సోషల్ మీడియాలో గుప్పుమన్నాయి. అయితే ఈ వార్తలపై నిత్యానంద స్వామి సోషల్ మీడియా వేదికగా స్పందించారు. తాను ప్రసుత్తం సమాధిలోకి వెళ్లానని.. మాట్లాడలేకపోతున్నానని.. మనుషులను గుర్తు పట్టలేకపోతున్నట్లు నిత్యానంద స్వామి వెల్లడించారు.

నిత్యానంద అసలు పేరు అరుణాచలం రాజశేఖరన్. తమిళనాడులోని తిరువణ్ణామలైలో తండ్రి అరుణాచలం, తల్లి లోకనాయకికి జన్మించాడు. అతను మొదటిసారిగా మూడేళ్ల వయసులో యోగిరాజ్ యోగానంద పూరితో వెలుగులోకి వచ్చాడు. 12 సంవత్సరాల వయస్సు నుంచి ఆధ్యాత్మిక అనుభవాలను కలిగి ఉన్న నిత్యానంద.. 22 సంవత్సరాల వయస్సులో పూర్తి జ్ఞానోదయాన్ని పొందారు. 2003లో బెంగుళూరు సమీపంలోని బిడాడిలో ధ్యానపీఠం అనే ఆశ్రమాన్ని ప్రారంభించాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం..