ఏడుగురు కాంగ్రెస్ ఎంపీలపై సస్పెన్షన్ ఎత్తివేత
ఏడుగురు కాంగ్రెస్ ఎంపీలపై విధించిన సస్పెన్షన్ ను లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా ఎత్తివేశారు. ఈ మేరకు సభలో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ సస్పెన్షన్ ఎత్తివేత తీర్మానాన్ని ప్రవేశపెట్టగా దాన్ని సభ మూజువాణీ ఓటుతో ఆమోదించింది.

లోక్ సభ కార్యకలాపాలకు అంతరాయం కలిగించారంటూ ఈ ఏడుగురిని గత వారం ఈ రెండో విడత బడ్జెట్ సమావేశాలు ముగిసేవరకు సస్పెండ్ చేసిన సంగతి విదితమే. వీరి సస్పెన్షన్ వ్యవహారాన్ని పరిశీలించేందుకు ప్రభుత్వం ఓ సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేసింది. సస్పెండయినవారిలో టీ.ఎన్.ప్రతాపన్, గౌరవ్ గొగోయ్, ఇబె హిందోన్, రాజ్ మోహన్ ఉన్నిధాన్, గుర్జిత్ సింగ్ అజ్లా, దీన్ కురియకోష్, మాణిక్యం ఠాకూర్ ఉన్నారు. ఢిల్లీ అల్లర్లపై చర్చకు పట్టుబట్టిన వీరు గత వారం గందరగోళం సృష్టించారు. ఆ సమయంలో స్పీకర్ స్థానంలో ఉన్న రమాదేవిపై కాగితాలు చింపి విసిరివేశారు. అయితే వీరి ప్రవర్తనకు దాదాపు క్షమాపణలు చెబుతూ కాంగ్రెస్ పార్టీ…. స్పీకర్ ఓం బిర్లాకు లేఖ కూడా రాసినట్టు తెలిసింది.