AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రెజ్లర్ సాగర్ రానా హత్య కేసులో ఒలంపిక్ మెడలిస్ట్ సుశీల్ కుమార్ కి 6 రోజుల పోలీస్ కస్టడీ, డబ్బు లేక మిత్రుడి వద్దకు వెళ్తుండగా అరెస్టయ్యాడట !

రెజ్లర్ సాగర్ రానా హత్య కేసులో ఒలంపిక్ మెడలిస్ట్ సుశీల్ కుమార్, అతని సహచరుడు అజయ్ కుమార్ కి ఆరు రోజుల పోలీస్ కస్టడికి రిమాండ్ చేస్తూ ఢిల్లీ కోర్టు ఉత్తర్వులిచ్చింది. వీరిని తమకు 12 రోజుల కస్టడీకి ఇవ్వాలని...

రెజ్లర్ సాగర్ రానా హత్య కేసులో ఒలంపిక్ మెడలిస్ట్ సుశీల్ కుమార్ కి 6 రోజుల పోలీస్ కస్టడీ, డబ్బు లేక మిత్రుడి వద్దకు వెళ్తుండగా అరెస్టయ్యాడట !
Ajith
Umakanth Rao
| Edited By: |

Updated on: May 23, 2021 | 11:22 PM

Share

రెజ్లర్ సాగర్ రానా హత్య కేసులో ఒలంపిక్ మెడలిస్ట్ సుశీల్ కుమార్, అతని సహచరుడు అజయ్ కుమార్ కి ఆరు రోజుల పోలీస్ కస్టడికి రిమాండ్ చేస్తూ ఢిల్లీ కోర్టు ఉత్తర్వులిచ్చింది. వీరిని తమకు 12 రోజుల కస్టడీకి ఇవ్వాలని ఢిల్లీ పోలీసులు కోరినప్పటికీ కోర్టు అందుకు తిరస్కరించింది. . ఆరు రోజులకు మాత్రం అనుమతించింది. ఢిల్లీ సిట్ పోలీసులు ఈ మధ్యాహ్నం ఈ ఇద్దరినీ ముంద్ కా ప్రాంతం వద్ద అరెస్టు చేశారు. 19 రోజులుగా వీరి కోసం ఖాకీలు గాలించారు. తనకు, సాగర్ రానాకు ఘర్షణ జరిగిన రోజున తాను స్పాట్ లోనే ఉన్నానని సుశీల్ కుమార్ కోర్టులో అంగీకరించాడు. తన వద్ద డబ్బు అయిపోయిందని, అందువల్ల దానికోసం నగరంలో ఒకరి వద్దకు వెళ్తుండగా పోలీసులు అరెస్టు చేశారని అతడు చెప్పాడు. కాగా ఇతనికి కొన్ని చెడు వ్యసనాలు ఉన్నాయని, డబ్బును దుబారాగా ఖర్చు పెట్టేవాడిని వార్తలు వచ్చాయి. సుశీల్ కుమార్, అజయ్ కుమార్ అరెస్టు నుంచి తప్పించుకోవడానికి, తమ ఆచూకీ తెలియకుండా ఉండేందుకు తమ్ సెల్ ఫోన్లను వాడకుండా వదిలేశారని తెలిసింది.

వీరు హరిద్వార్, రిషికేష్ తదితర ప్రాంతాల్లో తలదాచుకుంటూ వచ్చారని, డబ్బులు అయిపోవడంతో మళ్ళీ ఢిల్లీకి తిరిగి వచ్చారని భావిస్తున్నారు. వీరికోసం హర్యానా పోలీసులు కూడా అనేక చోట్ల గాలించడమే కాకుండా ప్రత్యేక పోలీసు బృందాలను నియమించారు. ఒకప్పుడు తన రెజ్లింగ్ ప్రతిభతో ఇండియాకు కీర్తి ప్రతిష్టలు తెచ్చి పెట్టిన ఈ ఒలంపిక్ మెడలిస్ట్ చివరకు హత్య కేసులో దోషిగా మారడం విశేషం.

భారత్‌పై మరోసారి జైష్-ఎ-మొహమ్మద్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు!
భారత్‌పై మరోసారి జైష్-ఎ-మొహమ్మద్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు!
మీరెప్పుడైనా కొవ్వొత్తి పువ్వులను చూశారా?.. ప్రత్యేక తెలిస్తే..
మీరెప్పుడైనా కొవ్వొత్తి పువ్వులను చూశారా?.. ప్రత్యేక తెలిస్తే..
మూత్రం రంగు మారుతోందా? ఆ వ్యాధికి సంకేతామా? ఏంటో తెలిస్తే..
మూత్రం రంగు మారుతోందా? ఆ వ్యాధికి సంకేతామా? ఏంటో తెలిస్తే..
47 వయసులో ఇండస్ట్రీని ఊపేస్తున్న హీరోయిన్..
47 వయసులో ఇండస్ట్రీని ఊపేస్తున్న హీరోయిన్..
పళ్లు తోముకోవడానికి బ్రష్‌ నిండా టూత్‌ పేస్ట్‌ వేసుకుంటున్నారా?
పళ్లు తోముకోవడానికి బ్రష్‌ నిండా టూత్‌ పేస్ట్‌ వేసుకుంటున్నారా?
ఫుడ్‌ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో షాకింగ్‌ విషయాలు...!
ఫుడ్‌ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో షాకింగ్‌ విషయాలు...!
జియోలో కేవలం రూ.1748 రీఛార్జ్‌తో 336 రోజుల వ్యాలిడిటీ..
జియోలో కేవలం రూ.1748 రీఛార్జ్‌తో 336 రోజుల వ్యాలిడిటీ..
ఘాటైన చూపుతో చంపేస్తున్న రాశి ఖన్నా.. బ్యూటిఫుల్ ఫొటోస్
ఘాటైన చూపుతో చంపేస్తున్న రాశి ఖన్నా.. బ్యూటిఫుల్ ఫొటోస్
కుప్పకూలిన "సునామీ స్వింగ్", ఒకరు మృతి, 13మందికి సీరియస్!
కుప్పకూలిన
శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఇక వాట్సాప్‌లో దర్శనం టిక్కెట్లు!
శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఇక వాట్సాప్‌లో దర్శనం టిక్కెట్లు!