NEET UG 2024 Row: ‘నీట్‌ యూజీ 2024’ పరీక్ష రద్దుపై నేడు సుప్రీం కోర్టులో విచారణ.. ఏం జరుగుతుందో?

|

Jun 13, 2024 | 11:38 AM

నీట్‌ యూజీ రగడ ఇంకా కొనసాగుతూనే ఉంది. నేషనల్ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) జూన్‌ 4న వెల్లడించిన ఫలితాల్లో అవకతవకలు జరిగాయని, పరీక్షను రద్దు చేయాలంటూ దేశ వ్యాప్తంగా మెడికల్ విద్యార్ధులు అందోళన చేపడుతున్నారు. ఈ క్రమంలో కొందరు విద్యార్ధులు సుప్రీంకోర్టులో మూడు పిటిషన్లను దాఖలు చేశారు. జస్టిస్‌ విక్రమ్‌నాథ్, జస్టిస్‌ సందీప్‌ మెహతాలతో కూడిన వెకేషన్‌ బెంచ్‌ ఈ పిటిషన్లపై గురువారం వాదనలు..

NEET UG 2024 Row: నీట్‌ యూజీ 2024 పరీక్ష రద్దుపై నేడు సుప్రీం కోర్టులో విచారణ.. ఏం జరుగుతుందో?
NEET UG 2024 Row
Follow us on

న్యూఢిల్లీ, జూన్ 13: నీట్‌ యూజీ రగడ ఇంకా కొనసాగుతూనే ఉంది. నేషనల్ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) జూన్‌ 4న వెల్లడించిన ఫలితాల్లో అవకతవకలు జరిగాయని, పరీక్షను రద్దు చేయాలంటూ దేశ వ్యాప్తంగా మెడికల్ విద్యార్ధులు అందోళన చేపడుతున్నారు. ఈ క్రమంలో కొందరు విద్యార్ధులు సుప్రీంకోర్టులో మూడు పిటిషన్లను దాఖలు చేశారు. జస్టిస్‌ విక్రమ్‌నాథ్, జస్టిస్‌ సందీప్‌ మెహతాలతో కూడిన వెకేషన్‌ బెంచ్‌ ఈ పిటిషన్లపై గురువారం వాదనలు విననున్నట్లు సుప్రీంకోర్టు రిజిస్ట్రీ తెలిపింది. నీట్‌ ప్రశ్నపత్రం లీకేజీ, ఇతర అక్రమాలపై అబ్లుల్లా మహమ్మద్‌ ఫైజ్, కార్తీక్‌ అనే ఇద్దరు విద్యార్ధులు వేర్వేరు పిటిషన్లు వేశారు. నీట్‌-యూజీ 2024లో 1563 మందికి 70 నుంచి 80 వరకు గ్రేస్‌ మార్కులు కేటాయించడంపై ఫిజిక్స్ వాలా వ్యవస్థాపకుడు అలఖ్ పాండే మరో పిటిషన్‌ వేశాడు. కౌన్సెలింగ్ ప్రక్రియపై స్టే విధించాలని పిటిషనర్లు కోరుతున్నారు.

ప్రశ్నాపత్రం లీకేజీతోపాటు ఒడిశా, కర్నాటక, జార్ఖండ్ రాష్ట్రాల విద్యార్థులు గుజరాత్‌లోని గోద్రాలో ఒక నిర్దిష్ట పరీక్షా కేంద్రాన్ని ఎంచుకున్నారని, ఇది పరీక్ష నిర్వహణపై పలు అనుమానాలను రేకెత్తి్ంచేలా ఉందని, పైగా హర్యాణాలోని ఓ పరీక్ష కేంద్రం నుంచి ఆరుగురు టాపర్లుగా నిలవడం అభ్యర్ధుల్లో అనుమానాలకు తావిస్తోంది. 67 మందికి ఫుల్‌ మార్కులు రావడం వెనుక గ్రేస్‌ మార్కులే కారణమని ఆరోపిస్తూ ఢిల్లీలో జూన్‌ 10న విద్యార్థులు ఆందోళన చేశారు. అంతేకాకుండా సుప్రీంకోర్టుతో పాటు, దేశవ్యాప్తంగా వివిధ హైకోర్టుల్లో పిటిషన్లు దాఖలు చేశారు. ఢిల్లీ హైకోర్టులో కూడా పిటిషన్లు దాఖాలు కాగా వాటిని బుధవారం విచారించింది. విచారణ సమయంలో దేశవ్యాప్తంగా వివిధ కోర్టుల్లో ఉన్న కేసులన్నీ సుప్రీంకోర్టుకు బదిలీ చేయాలని నీట్‌ పరీక్ష నిర్వహించిన ఎన్టీఏ ఢిల్లీ హైకోర్టుకు తెలిపింది.

కాగా నీట్‌ యూజీ 2024 ప్రవేశ పరీక్ష మే 5న దేశవ్యాప్తంగా 4,750 కేంద్రాల్లో జరిగింది. దాదాపు 24 లక్షల మంది అభ్యర్థులు రాశారు. తాజాగా విడుదలైన ఫలితాల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా 67 మంది విద్యార్ధులు 720కి 720 మార్కులు వచ్చాయి. ఇదే దేశ వ్యాప్తంగా పలు ఆందోళనలకు కారణమైంది. ఈరోజు ఉదయం 10.30 తర్వాత సుప్రీంకోర్టుల వాదనలు ప్రారంభం కానున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.