The Kerala Story: ది కేరళ స్టోరీ చిత్రాన్ని ఆపలేమన్న సుప్రీంకోర్టు.. తమిళనాడుకు హై అలెర్ట్

ది కేరళ స్టోరీ చిత్రంపై వివాదం దేశవ్యాప్తంగా దూమారం రేపుతోంది. ఈ చిత్ర విడుదలను ఆపాలంటూ సుప్రీంకోర్టులో ఇటీవల పిటీషన్లు కూడా దాఖలయ్యాయి. అయితే దీనిపై స్పందించిన సుప్రీం కోర్టు చిత్రం విడుదలను ఆపలేమంటూ మంగళవారం పిటీషన్‌ను తోసిపుచ్చింది.

The Kerala Story: ది కేరళ స్టోరీ చిత్రాన్ని ఆపలేమన్న సుప్రీంకోర్టు.. తమిళనాడుకు హై అలెర్ట్
The Kerala Story

Updated on: May 03, 2023 | 8:22 PM

ది కేరళ స్టోరీ చిత్రంపై వివాదం దేశవ్యాప్తంగా దూమారం రేపుతోంది. ఈ చిత్ర విడుదలను ఆపాలంటూ సుప్రీంకోర్టులో ఇటీవల పిటీషన్లు కూడా దాఖలయ్యాయి. అయితే దీనిపై స్పందించిన సుప్రీం కోర్టు చిత్రం విడుదలను ఆపలేమంటూ మంగళవారం పిటీషన్‌ను తోసిపుచ్చింది. శుక్రవారం విడుదల కానున్న ఈ సినిమా ట్రైలర్‌కు ఇప్పటికే 1.6 కోట్ల వ్యూస్ వచ్చాయని సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్, నిజాం పాషాల.. జస్టీస్ కేఎం జోసెఫ్, జస్టీస్ బీవీ నాగరత్న లతో కూడిన ధర్మాసనానికి వివరించారు. అయితే ఈ చిత్రం ద్వేషపూరితమైన ప్రసంగమని నిజాం పాషా అన్నారు.

విద్వేష ప్రసంగాల్లోనూ కొన్ని రకాలుంటాయని.. ఈ చిత్రానికి సెన్సార్ బోర్టు సర్టిఫికేట్ కూడా ఇచ్చిందని జస్టీస్ నాగరత్న ధర్మాసనం తెలిపింది. ఇది ఓ వ్యక్తి చేసిన విద్వేష ప్రసంగంగా పరిగణించలేమని పేర్కొంది. ఈ సినిమా విడుదలపై సవాలు చేయాలనుకుంటే సెన్సార్ సర్టిఫికేట్ పై చేయాలని తెలిపింది. పిటీషినర్ మొదటగా హైకోర్టుకు వెళ్లాలని.. నేరుగా సుప్రీంకోర్టుకు వస్తే ప్రతిఒక్కరు ఇలాంటి పద్ధతినే ఎంచుకుంటారంటూ వ్యాఖ్యానించింది. అయితే సమయం లేకపోవడ వల్లే సుప్రీం కోర్టులో దాఖలు చేసినట్లు న్యాయవాది కపిల్ సిబల్ తెలిపారు. మరోవైపు ఒకవేళ ఈ సినిమా విడుదలైతే తమిళనాడులో నిరసనలు జరుగుతాయని ఇంటిలిజెన్స్ సంస్థలు హెచ్చరికలు జారీ చేశాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..