Supreme Court RTI Portal: ఆన్‌లైన్ ‘ఆర్టీఐ’ పోర్టల్‌ను ప్రారంభించిన సుప్రీంకోర్టు.. ఇక నుంచి ఆ బాధ తప్పినట్లే..

|

Nov 23, 2022 | 12:34 AM

సుప్రీంకోర్టు మంగళవారం ఆన్‌లైన్ ఆర్టీఐ పోర్టల్‌ను ప్రారంభించింది. సుప్రీంకోర్టు ప్రస్తుతం ఈ పోర్టల్‌ని టెస్ట్ వెర్షన్‌గా యాక్టివేట్ చేసింది. ఫైనల్ వెర్షన్ వచ్చే

Supreme Court RTI Portal: ఆన్‌లైన్ ‘ఆర్టీఐ’ పోర్టల్‌ను ప్రారంభించిన సుప్రీంకోర్టు.. ఇక నుంచి ఆ బాధ తప్పినట్లే..
Supreme Court of India
Follow us on

సుప్రీంకోర్టు మంగళవారం ఆన్‌లైన్ ఆర్టీఐ పోర్టల్‌ను ప్రారంభించింది. సుప్రీంకోర్టు ప్రస్తుతం ఈ పోర్టల్‌ని టెస్ట్ వెర్షన్‌గా యాక్టివేట్ చేసింది. ఫైనల్ వెర్షన్ వచ్చే 5 రోజుల్లో యాక్టివేట్ అవుతుంది. ఈ పోర్టల్ ద్వారా, ప్రజలు సమాచార హక్కును ఉపయోగించి RTI దరఖాస్తులను ఫైల్ చేయవచ్చు. అవసరమైన సమాచారాన్ని పొందవచ్చు. ఈ పోర్టల్ పేరు registry.sci.gov.in/rti_app. కాగా, భారతీయ పౌరులు మాత్రమే దీనిని ఉపయోగించి ఆర్టీఐ దరఖాస్తు చేయడానికి వీలు ఉంటుంది. దీనికి నిర్ణీత రుసుము చెల్లించాల్సి ఉంటుంది. RTI ఫైల్ చేయడానికి రూ.10 ఖర్చు అవుతుంది. దరఖాస్తుదారు ఇంటర్నెట్ బ్యాంకింగ్, మాస్టర్/వీసా లేదా UPI క్రెడిట్/డెబిట్ కార్డ్‌ల ద్వారా నిర్ణీత రుసుమును చెల్లించవచ్చు.

త్వరలోనే పోర్టల్‌ను ప్రారంభిస్తామని తెలిపిన సీజేఐ..

ఇంతకు ముందు ప్రజలు పోస్టాఫీసుకు వెళ్లి పోస్ట్ ద్వారా ఆర్టీఐ దాఖలు చేయాల్సి వచ్చేది. ఈ నేపథ్యంలోనే ఆన్‌లైన్ ఆర్టీఐ పోర్టల్‌ను కోరుతూ సుప్రీంకోర్టులో వివిధ పిల్‌లు దాఖలయ్యాయి. గత వారం కూడా ఇలాంటి పిటిషన్‌పై విచారణ సందర్భంగా.. భారత ప్రధాన న్యాయమూర్తి (సిజెఐ) డివై చంద్రచూడ్, జస్టిస్ హిమా కోహ్లీలతో కూడిన ధర్మాసనం త్వరలో పోర్టల్‌ను ప్రారంభించనున్నట్లు తెలిపింది. ఆ మేరకు ఇప్పుడు పోర్టల్ ప్రారంభించారు.

పోర్టల్ కోసం పిటిషన్..

న్యాయ విద్యార్థులు ఆకృతి అగర్వాల్‌, లక్ష్య పురోహిత్‌లు దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ పిటిషన్‌లో, ఆన్‌లైన్‌లో ఆర్‌టిఐ దరఖాస్తులను దాఖలు చేయడానికి ఆన్‌లైన్ పోర్టల్‌ను డిమాండ్ చేశారు. గతంలో పోస్ట్ ద్వారా సుప్రీంకోర్టులో ఆర్టీఐ దరఖాస్తులు దాఖలయ్యాయి. పిటీషన్ల ఇ-ఫైలింగ్ కోసం ఇ-కమిటీ ఇప్పటికే ఒక పోర్టల్‌ను అందించిందని, ఆర్‌టిఐ దరఖాస్తుల ఇ-ఫైలింగ్ విషయానికి వస్తే అదే సౌకర్యాన్ని అందించడం లేదని పిల్‌లో పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

ఆర్టీఐ అంటే ఏంటి?

సమాచార హక్కు చట్టం. 2005లో అమల్లోకి వచ్చిన ఈ చట్టం ప్రకారం.. దేశంలోని ఏ పౌరుడైనా ఏ ప్రభుత్వ శాఖను అయినా విచారించవచ్చు. దీని ద్వారా రికార్డులు, పత్రాలు, నివేదికలు, సలహాలు/అభిప్రాయాలు, ఫైల్ నోట్స్ వంటి ప్రభుత్వ పత్రాల కాపీలను పొందవచ్చు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..