Birthday celebrations: పుట్టిన రోజు వేడుకల్లో విషాదం.. ఒకే కుటుంబంలోని మూడు తరాల వారు బలి..
ఆనందంగా పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్న వేళ పెను ప్రమాదం సంభవించింది. అగ్ని ప్రమాదం రూపంలో ఓ కుటుంబం మొత్తాన్ని కబళించింది. గాజాలోని శరణార్థుల శిబిరంలో ఈ విషాదం చోటుచేసుకుంది.
ఆనందంగా పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్న వేళ పెను ప్రమాదం సంభవించింది. అగ్ని ప్రమాదం రూపంలో ఓ కుటుంబం మొత్తాన్ని కబళించింది. గాజాలోని శరణార్థుల శిబిరంలో ఈ విషాదం చోటుచేసుకుంది. ఆనందంగా జరుగుతున్న ఓ పుట్టిన రోజు వేడుక చివరికి విషాదంగా ముగిసింది. ఓ అపార్ట్‌మెంట్‌లో మంటలు అంటుకుని 21 మంది సజీవ దహనం అయ్యారు. వారిలో 17 మంది ఒకే కుటుంబానికి చెందిన వారు. కాగా తీరిలో ఏడుగురు చిన్నారులు కూడా ఉన్నారు. గాజాలోని జబాలియా శరణార్థుల శిబిరంలో నవంబరు 17 రాత్రి మూడు అంతస్తులున్న భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఓ భవనంలోని పై అంతస్తులో అబు రయా అనే వ్యక్తి కుటుంబం నివసిస్తోంది.ఆయన కుటుంబంలోని ఓ చిన్నారి పుట్టిన రోజు వేడుకతోపాటు, ఈజిప్టు నుంచి ఓ వ్యక్తి రావడంతో ఆనందంతో అందరూ కలిసి వేడుక జరుపుకున్నారు. ఈ క్రమంలో సంభవించిన అగ్ని ప్రమాదం వారిని పూర్తిగా దగ్ధం చేసింది. ఇంట్లో నిల్వచేసిన పెట్రోలుకు మంటలు అంటుకోవడం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని చెబుతున్నా.. దానికి మంటలు ఎలా అంటుకున్నాయన్న దానిపై స్పష్టత లేదు. ప్రమాదం గురించి చెప్పేందుకు కుటుంబ సభ్యుల్లో ఒకరు కూడా మిగలకపోవడం విషాదం. అయితే, పెట్రోలే ప్రమాదానికి కారణమన్న వార్తలను అబూ రయా బంధువు మహ్మద్ అబూరయా కొట్టిపడేశారు. వారి ఇంట్లో ఫర్నిచర్ అధికంగా ఉందని, మంటలు పెద్ద ఎత్తున చెలరేగడానికి అది కూడా కారణమై ఉంటుందని అన్నారు. బాధిత కుటుంబంలో మూడు తరాలకు చెందినవారు ఉన్నారని చెప్పారు. గాజా తీవ్రమైన ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో ఇళ్లలో పెట్రోలు, డీజిల్, గ్యాస్‌ను నిల్వచేసుకోవడం ఇక్కడి ప్రజలకు పరిపాటిగా మారింది. ఇప్పుడదే వారి ప్రాణాలు తీస్తోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Alien Birth: బీహార్‌లో వింత శిశువు.. గ్రహాంతరవాసి జననం..? వీడియో చూసి తెగ షేర్ చేస్తున్న నెటిజన్స్..
గ్రహణం వేళ తెరిచి ఉన్న ఆలయం.. స్వామి వారికి ప్రత్యేక పూజలు!
వైభవంగా ఖాద్రీశుడి బ్రహ్మోత్సవాలు..'జ్ఞాన సరస్వతి'గా నారసింహుడు!
శనివారం ఉదయమే దాడి చేయడం.. వెనకున్న కారణం ఇదే..!
ఇరానీ చాయ్,కార్పెట్లు,డ్రైఫ్రూట్స్.. హైదరాబాద్‌కు 400 ఏళ్ల బంధం
సంతలో కూరగాయలు కొంటున్నారా.. జాగ్రత్త !
పోలీసులకే షాకిచ్చిన దొంగల మాస్టర్ ప్లాన్ !
నాన్న, అంకుల్ దుబాయ్ వెళ్లారు..ఎలా ఉన్నారో ఏమో?
హోలీ పండగలో వాడే కెమికల్ రంగులపై వైద్యుల వార్నింగ్!
గ్రహణం వేళ తెరిచి ఉన్న ఆలయం.. స్వామి వారికి ప్రత్యేక పూజలు!
వైభవంగా ఖాద్రీశుడి బ్రహ్మోత్సవాలు..'జ్ఞాన సరస్వతి'గా నారసింహుడు!
పవన్ కళ్యాణ్ డ్యాన్స్‌కు సెట్లో క్రేజీ రియాక్షన్..నేను మాత్రం..
శనివారం ఉదయమే దాడి చేయడం.. వెనకున్న కారణం ఇదే..!

