AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: మూఢ నమ్మకాలకు పరాకాష్ట.. మొక్కుల కోసం.. ఒళ్లంతా వేడి వేడి నెయ్యి పూసుకొని..

Tamil Nadu: మూఢనమ్మకాలపై ప్రజలకు ఎన్నిసార్లు అవగాహన కల్పించినప్పటికీ.. ఫలితం లేకుండా పోతోంది. చాలామంది విశ్వాసంతో వాటినే ఆచరిస్తున్నారు.

Watch Video: మూఢ నమ్మకాలకు పరాకాష్ట.. మొక్కుల కోసం.. ఒళ్లంతా వేడి వేడి నెయ్యి పూసుకొని..
Tamil Nadu
Shaik Madar Saheb
|

Updated on: Mar 12, 2022 | 3:45 PM

Share

Tamil Nadu: మూఢనమ్మకాలపై ప్రజలకు ఎన్నిసార్లు అవగాహన కల్పించినప్పటికీ.. ఫలితం లేకుండా పోతోంది. చాలామంది విశ్వాసంతో వాటినే ఆచరిస్తున్నారు. తాజాగా తమిళనాడులోని విరుదునగర్ జిల్లా (virudhunagar district) లోని ఓ గ్రామం మూఢ నమ్మకాలకు పరాకాష్టగా మారింది. దేవుడికి మొక్కుల కోసం వింత ఆచారం పాటిస్తున్నారు ఈ ప్రాంత వాసులు. మరుగుతున్న నెయ్యిని ఒళ్ళంతా పూసుకునే వింత ఆచారం ఇక్కడే కనిపిస్తుంది. దీంతోపాటు మరుగుతున్న నెయ్యిలో నుంచి వంటకాలను చేతులతో తీస్తుంటారు. ఈ షాకింగ్ ఘటన విరుదునగర్ జిల్లా తిరుచిరాపల్లి సమీపంలోని పులియందర్‌కోట్టై గ్రామంలో చోటుచేసుకుంది. ఈ గ్రామంలో ఏటా 200 ఏళ్ల నాటి శ్రీమరనాడు కరుప్పనస్వామి ఆలయ ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి. ఈ పండుగ సందర్భంగా చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు అగ్గిపుల్లలు, ఇరవై ఒక్క కన్నుల పటాకులు తీసుకొచ్చి మొక్కులు చెల్లించుకున్నారు.

దీని తర్వాత పండుగలో ప్రధాన ఘట్టమైన నెయ్యి మరుగుతున్న పాత్రలో వంటలను చేతులతో కాల్చే కార్యక్రమం జరుగుతుంది. ఈ ఉత్సవాల్లో ముందుగా పట్టణంలోని శ్రీమంతయమ్మన్ ఆలయ పీఠం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆ తరువాత ఉపవాసం ఉన్న భక్తులు చేతులకు వేడి వేడిగా కాచిన నెయ్యి పూసుకుని, చేతులు, మొహం, కాళ్లపై చల్లుకుని, చేతితో టపాకాయలు తీసుకోవడం ఆనవాయితీ. మరుగుతున్న నెయ్యిలో ఉన్న వంటకాలను తమ చేతులతో తీసి స్వామి వారికి మొక్కులు చెల్లిస్తారు.

ప్రతి సంవత్సరం జరిగే ఈ వేడుకలకి విరుదునగర్ జిల్లా వ్యాప్తంగా భక్తులు తరలివస్తారు. తమ ఒంటిని కాల్చుకొని మొక్కులు తీరిస్తే స్వామి వారు.. కోర్కెలు నెరవేరుస్తారని గ్రామస్థులు విశ్వసిస్తారు. వీటికి సంబంధించిన ఫోటోలు.. వీడియోలు వైరల్ అవుతుండటంతో మూఢ భక్తికి ఇది నిదర్శనమంటూ సోషల్ మీడియాలో నెటిజెన్స్ కామెంట్లు చేస్తున్నారు.

Also Read:

Viral Video: స్టంట్ చేయబోయి బొక్కబోర్లా పడిన ముద్దుగుమ్మ.. నవ్వులు పూయిస్తున్న వీడియో..

Video Viral: ఈ భారీ అనకొండను మీరెప్పుడైనా చూశారా..?.. సోషల్‌ మీడియాలో వీడియో వైరల్‌