యాక్షన్ సినిమాను తలపించేలా 500 కిలోమీటర్ల పోలీసులు చేజింగ్.. ఆ తర్వాత ఏం జరిగిందంటే
సూపర్ దొంగగా గుర్తింపు తెచ్చుకున్న బంటీ అలియాస్ దేవేంద్ర సిగ్ అనే దొంగ మళ్లీ పోలీసులకు చిక్కాడు. దాదాపు 500 కిలోమీటర్లు యాక్షన్ సినిమాలో లాగా వెంబడించిన పోలీసులు ఉత్తరప్రదేశ్ లో ఎట్టకేలకు అతడ్ని పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే దిల్లీలోని వికాస్‌పురిలో దేవేంద్ర సింగ్ తన తల్లిదండ్రులతో కలిసి ఉండేవాడు.

సూపర్ దొంగగా గుర్తింపు తెచ్చుకున్న బంటీ అలియాస్ దేవేంద్ర సిగ్ అనే దొంగ మళ్లీ పోలీసులకు చిక్కాడు. దాదాపు 500 కిలోమీటర్లు యాక్షన్ సినిమాలో లాగా వెంబడించిన పోలీసులు ఉత్తరప్రదేశ్ లో ఎట్టకేలకు అతడ్ని పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే దిల్లీలోని వికాస్‌పురిలో దేవేంద్ర సింగ్ తన తల్లిదండ్రులతో కలిసి ఉండేవాడు. 9 వ తరగతి పరీక్షలో ఫెయిల్ అయినందుకు దేవేంద్ర సింగ్ ని అతని తండ్రి కొట్టి మందలించారు. దీంతో దేవేంద్ర గజ దొంగగా మారిపోయాడు. 14 ఏళ్ల ప్రాయంలోనే దొంగతనాలు చేయడం మొదలుపెట్టాడు. గత 30 ఏళ్లుగా తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో లెక్కలేనన్ని చోరీలు చేశాడు. ఆయా రాష్ట్రాల్లో ఇతనిపై అనేక కేసులున్నాయి.
2008లో దేవేంద్ర సింగ్ కథ ఆధారంగా ఓయ్ లక్కీ! లక్కీ ఓయ్ అనే సినిమా కూడా విడుదలై సూపర్ హిట్ అయ్యింది. ఇంకో విషయం ఏంటంటే ఇతను హిందీ బిగ్ బాస్ 4 లో కూడా పాల్గొన్నాడు. అరెస్టు చేసిన ప్రతిసారి పోలీసులు అతని నుంచి బంగారం, విలవైన వస్తువులు స్వాధీనం చేసుకునేవారు. 2013లో కేరళలోని తిరవనంతపురంలో ఓ వ్యాపరవేత్త ఇంట్లో రూ.28 లక్షల విలువైన ఎస్‌యూవీ కారు, లాప్‌టాప్, మొబైల్ ఫోన్లు చోరీ చేశాడు. ఆరు రోజుల తర్వాత దేవేంద్ర పోలీసులకు దొరికాడు. ఈ దొంగతనంలో అతనికి దాదాపు 10 ఏళ్ల జైలు శిక్ష పడింది. ఇటీవలే విడుదలైన దేవేంద్ర సింగ్ మళ్లీ ఢిల్లీలోని రెండు ఇళ్లల్లో చోరీకి పాల్పడ్డాడు. అతని కోసం దాదాపు 500 కిలోమీటర్లు వెంబడించిన పోలీసులు యూపీలోని కాన్పూర్ వద్ద పట్టుకుని అరెస్టు చేశారు. ఇలా ఖరీదైన వాహనాలు, బంగారం, వజ్రాలు, లగ్జరీ కార్లను అపహరించే బంటీ పెద్ద పెద్ద హోటళ్లలోనే గడిపేవాడు.




మరిన్ని జాతీయ వార్తల కోసం..




