Ratan Tata: రతన్ టాటాను రెండు బహుమతులు అడిగిన సుధా మూర్తి.. నేటికీ ఆఫీసులో దర్శనం.. ఏమిటంటే

|

Oct 14, 2024 | 9:25 PM

రతన్ టాటా కరుణకలిగిన వ్యక్తి అని ఇతరుల సంక్షేమం గురించి ఎక్కువ శ్రద్ధ చూపిస్తారంటూ సుధామూర్తి చెప్పారు. అంతేకాదు రతన్ టాటా వ్యక్తిత్వం, వ్యాపార రంగంలో విశేషమైన పాత్ర, నాయకత్వాన్ని నిర్వచిస్తూ.. ఆయన పాటించే విలువలను తాను రతన్ టాటాను కలిసిన సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు. మంచితనానికి నిలువెత్తు ప్రతి రూపమైన రతన్ టాటాను కోల్పోవడం బాధాకరం అని చెప్పారు. తన జీవితంలో కలిసిన అరుదైన వ్యక్తుల్లో రతన్ టాటా వెరీ వెరీ స్పెషల్ అన్నారు.

Ratan Tata: రతన్ టాటాను రెండు బహుమతులు అడిగిన సుధా మూర్తి.. నేటికీ ఆఫీసులో దర్శనం.. ఏమిటంటే
Sudha Murthy And Ratan Tata
Follow us on

రతన్ టాటా మరణానంతరం పలువురు రాజకీయ నేతలు, బాలీవుడ్ ప్రముఖులు దివంగత పారిశ్రామికవేత్తపై తమ అభిమానాన్ని, గౌరవాన్ని వ్యక్తం చేస్తూనే ఉన్నారు. రతన్ టాటాను కోల్పోయినందుకు సంతాపం వ్యక్తం చేస్తూ ప్రఖ్యాత రాజ్యసభ ఎంపీ సుధామూర్తి ఆయనను “అసమానమైన సమగ్రత, సరళత” ఉన్న వ్యక్తిగా అభివర్ణించారు. రతన్ టాటా కరుణకలిగిన వ్యక్తి అని ఇతరుల సంక్షేమం గురించి ఎక్కువ శ్రద్ధ చూపిస్తారంటూ సుధామూర్తి చెప్పారు. అంతేకాదు రతన్ టాటా వ్యక్తిత్వం, వ్యాపార రంగంలో విశేషమైన పాత్ర, నాయకత్వాన్ని నిర్వచిస్తూ.. ఆయన పాటించే విలువలను గుర్తు చేసుకున్నారు.

ప్రముఖ వార్తా సంస్థ ANIతో సుధా మూర్తి మాట్లాడతూ.. తాను రతన్ టాటాను కలిసిన సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు. మంచితనానికి నిలువెత్తు ప్రతి రూపమైన రతన్ టాటాను కోల్పోవడం బాధాకరం అని చెప్పారు. తన జీవితంలో కలిసిన అరుదైన వ్యక్తుల్లో రతన్ టాటా వెరీ వెరీ స్పెషల్ అన్నారు.

ఇవి కూడా చదవండి

రతన్ టాటా మరణంపై రాజ్యసభ ఎంపీ సుధా మూర్తి ఇలా అన్నారు

రతన్ టాటా రెండు బహుమతులు కోరుకున్న సుధా మూర్తి

రతన్ టాటా ఉదార స్వభావం గురించి మాట్లాడుతూ.. తాను రతన్ టాటా నుండి రెండు అమూల్యమైన బహుమతులను అభ్యర్థించానని.. ఆ రెండింటినీ రతన్ టాటా అందించారని వెల్లడించారు. ఈ బహుమతులు ఇప్పటికీ తన వ్యక్తిగత ఆఫీసులో ఉన్నాయని చెప్పారు. అవి తనకు రతన్ టాటాకు ఉన్న స్నేహానికి గుర్తు అని ..ఆయన ఔదార్యానికి ప్రతిష్టాత్మకమైన జ్ఞాపకాలుగా ఉపయోగపడుతున్నాయని పేర్కొన్నారు.

90వ దశకం ప్రారంభంలో టాటా గ్రూప్ వ్యవస్థాపకుడు జంషెడ్‌జీ టాటా.. టాటా గ్రూప్ మాజీ ఛైర్మన్ JRD టాటాకు సంబంధించిన రెండు చిత్రాలను తాను అభ్యర్థించిన సంఘటనను సుధా మూర్తి ప్రేమగా గుర్తు చేసుకున్నారు. ప్రియతమ పారిశ్రామికవేత్త రతన్ టాటా ఆమె అభ్యర్థనను వెంటనే నెరవేర్చారు. క్షణాల్లో తాను కోరుకున్న చిత్రాలను అందించారని.. టాటా వారసత్వం, రతన్ టాటాతో తను పంచుకున్న బంధం, ఆయనపై తనకున్న అభిమానాన్ని చిరస్థాయిగా గుర్తు చేస్తూ ఈ ఐశ్వర్యవంతమైన ఛాయాచిత్రాలను ఇప్పటికీ తన ఆఫీసులో భద్రపరుచుకున్నట్లు సుధా మూర్తి వెల్లడించారు.

అయితే సుధా మూర్తి తన కెరీర్ ను టాటా ఇంజనీరింగ్ & లోకోమోటివ్ కంపెనీ (టెల్కో)లో ప్రారంభించారు. ఈ సంస్థని ఇప్పుడు టాటా మోటార్స్ అని పిలుస్తారు. ఇది భారతదేశంలో అతిపెద్ద ఆటో తయారీదారీ సంస్థ. సుధా మూర్తి పూణేలో డెవలప్‌మెంట్ ఇంజనీర్‌గా కెరీర్ ను ప్రారంభించి.. అనంతరం ముంబై , జంషెడ్‌పూర్ రెండింటిలోనూ ఉద్యోగిగా విధులను నిర్వహించారు.

సుధా మూర్తి TELCOలో ఉద్యోగం చేస్తున్న సమయంలో ఆ సంస్థ ఛైర్మన్‌కి కంపెనీలో ప్రబలంగా ఉన్న లింగ పక్షపాతం గురించి ప్రస్తావిస్తూ.. ఒక పోస్ట్‌కార్డ్‌ వ్రాశారు. ఈ లెటర్ సుధా మూర్తి కెరీర్ లో ముఖ్యమైన మలుపుగా మారింది. ఆ సమయంలో ప్రధాన ఉద్యోగాస్తులుగా ఎక్కువగా పురుషులు ఉన్నారు. సుధా మూర్తి సాహసోపేతమైన చర్య ప్రత్యేక ఇంటర్వ్యూకి దారితీసింది. ఫలితంగా అక్కడికక్కడే TELCO యాజమాన్యం పలు నిర్ణయాలు తీసుకుంది. అనేక మార్గదర్శక చర్యలు చేపట్టింది. సుధా కెరీర్‌కు ఒక పోస్ట్ కార్డ్ నాంది పలకడమే కాదు..టాటాలో ఇంజినీరింగ్ రంగంలో మహిళలకు అధిక ప్రాతినిధ్యానికి మార్గం సుగమం చేసింది.

 

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..