Smartphones: ఆ రాష్ట్రంలో అన్నదాతకు గుడ్ న్యూస్.. స్మార్ట్ ఫోన్ కొనుగోలుపై ప్రభుత్వం భారీ సబ్సిడీ..
Smartphones: గుజరాత్ (Gujarat)లోని కొత్త ప్రభుత్వం రైతులకు శుభవార్త వినిపించింది. అన్నదాత (Farmer)కు స్మార్ట్ ఫోన్ కొనుగోలుపై సబ్సిడీ ఇవ్వనున్నామని ఆ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి..
Smartphones: గుజరాత్ (Gujarat)లోని కొత్త ప్రభుత్వం రైతులకు శుభవార్త వినిపించింది. అన్నదాత (Farmer)కు స్మార్ట్ ఫోన్ కొనుగోలుపై సబ్సిడీ ఇవ్వనున్నామని ఆ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి రాఘవ్ జీ పటేల్ (Agriculture Minister Raghavji Patel) ప్రటించారు. గాంధీనగర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ విషయాన్ని ప్రకటించారు. ఈ ఏడాది చివర్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రజల విశ్వాసాన్ని చూరగొనేందుకు బీజేపీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగానే బిజేపీ సర్కార్ ఇదంతా చేస్తున్నట్లు కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. గుజరాత్ లోని భూపేంద్ర పటేల్ నేతృత్వంలోని ప్రభుత్వం ఈ నెల ప్రారంభంలో 121 రోజులు పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే.
రూ.15వేలు అంతకంటే తక్కువ ధరకు కొనుగోలు చేసే ఫోన్లకు ప్రొడక్ట్ పై రూ.6వేల వరకూ డిస్కౌంట్ ఇవ్వాలని నిర్ణయించారు. ఇంతకుముందు సబ్సిడీ 10 శాతం లేదా రూ.1500 మాత్రమే ఇచ్చేవారు. జనవరి 17 తర్వాత ఈ బెనిఫిట్ కోసం i-Khedut పోర్టల్ లో మొత్తం 12,421 మంది రైతులు దరఖాస్తు చేసుకున్నారని మంత్రి తెలిపారు.
సెప్టెంబరు 2021లో మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ స్థానంలో వచ్చిన భూపేంద్ర పటేల్ నేతృత్వంలోని ప్రభుత్వం ట్రాక్టర్ల కొనుగోలు కోసం రైతులకు అందించే ఆర్థిక సహాయాన్ని కూడా పెంచింది. 60 హార్స్ పవర్ లేదా అంతకంటే తక్కువ సామర్థ్యం ఉన్న ట్రాక్టర్లను కొనుగోలు చేసేందుకు సబ్సిడీని రూ.60,000-75,000 లేదా ట్రాక్టర్ ధరలో 25 శాతానికి పెంచారు. అదేవిధంగా, రైతులు తమ పొలంలో పంట-నిల్వ సౌకర్యాలను అభివృద్ధి చేయడానికి అందించే సహాయాన్ని రూ. 1 లక్షకు లేదా నిర్మాణ వ్యయంలో 50 శాతానికి రెట్టింపు చేశారు.