AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Corona Endemic: దేశంలో కరోనా విలయతాండవం.. గుడ్ న్యూస్ చెప్పిన ఐసీఎంఆర్ సైంటిస్ట్.!!

దేశంలో కరోనా మహమ్మారి మరోసారి విలయతాండవం సృష్టిస్తోంది. ఒకవైపు ఒమిక్రాన్.. మరోవైపు కోవిడ్ పాజిటివ్ కేసులు...

Corona Endemic: దేశంలో కరోనా విలయతాండవం.. గుడ్ న్యూస్ చెప్పిన ఐసీఎంఆర్ సైంటిస్ట్.!!
Corona
Ravi Kiran
|

Updated on: Jan 19, 2022 | 2:51 PM

Share

దేశంలో కరోనా మహమ్మారి మరోసారి విలయతాండవం సృష్టిస్తోంది. ఒకవైపు ఒమిక్రాన్.. మరోవైపు కోవిడ్ పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతూపోతున్నాయి. తాజాగా రోజువారీ నమోదవుతున్న పాజిటివ్ కేసుల సంఖ్య దాదాపుగా మూడు లక్షలకు చేరువ కావడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ తరుణంలో ఐసీఎంఆర్ సైంటిస్ట్ ఒకరు ఊరటనిచ్చే వార్తను వినిపించారు. మార్చి 11 నాటికి కరోనా ఎండమిక్ స్టేజికి చేరుకుంటుందని ఐసీఎంఆర్ ఎపిడెమియోలాజిస్ట్ డి సమీరన్ పాండా వెల్లడించారు.

నిపుణుల అంచనా ప్రకారం.. దేశంలో డిసెంబర్ 11 నుంచి ప్రారంభమైన ఒమిక్రాన్ వేవ్.. మూడు నెలల పాటు కొనసాగే అవకాశం ఉంది. మార్చి 11 తర్వాత కరోనా నుంచి ఉపశమనం పొందొచ్చు. మనం అజాగ్రత్త వహించకుండా ఉంటే.. డెల్టాను ఒమిక్రాన్ అధిగమిస్తే.. కొత్త వేరియంట్లేవి ఉద్భవించకపోతే మార్చి 11 నాటికి కోవిడ్ సాధారణ ఫ్లూగా మారుతుందని సమీరన్ చెప్పుకొచ్చారు.

ప్రస్తుతం దేశంలోని వివిధ రాష్ట్రాల్లో కరోనా వివిధ దశల్లో ఉంది. ఢిల్లీ, ముంబై లాంటి నగరాల్లో కోవిడ్ కేసులు గరిష్ట స్థాయికి చేరాయా.? లేదా.? అనే విషయం తెలియాలంటే మరో రెండు వారాలు వేచి చూడాలి. కరోనా రూపాంతరాల నేపధ్యంలో ఐసీఎంఆర్ కూడా టెస్టింగ్ వ్యూహాల్లో మార్పులు చేస్తోంది.

Follow Us
యమహా నుంచి అదిరిపోయే అప్‌డేట్స్: 2026 హైబ్రిడ్ స్కూటర్లు ఇవే
యమహా నుంచి అదిరిపోయే అప్‌డేట్స్: 2026 హైబ్రిడ్ స్కూటర్లు ఇవే
నీలిరంగు పూలతో నల్లమల అడవికి కొత్త అందం..
నీలిరంగు పూలతో నల్లమల అడవికి కొత్త అందం..
రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 కొత్త ఎడిషన్ విడుదలకు కారణమిదే
రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 కొత్త ఎడిషన్ విడుదలకు కారణమిదే
7 ఏళ్లప్పుడు బతుకు తెరువు కోసం వలస.. నేడు చరిత్ర తిరగరాసింది!
7 ఏళ్లప్పుడు బతుకు తెరువు కోసం వలస.. నేడు చరిత్ర తిరగరాసింది!
'టాక్సిక్‌' అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం.. టికెట్ల ధరల వివరాలివే
'టాక్సిక్‌' అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం.. టికెట్ల ధరల వివరాలివే
కుమారుడి కారు ప్రమాద ఘటనపై స్పందించిన ఎంపీ లింగమనేని రమేష్
కుమారుడి కారు ప్రమాద ఘటనపై స్పందించిన ఎంపీ లింగమనేని రమేష్
రేషన్ కార్డు లేకపోయినా సన్న బియ్యం.. ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్
రేషన్ కార్డు లేకపోయినా సన్న బియ్యం.. ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్
ఫ్లెక్స్-వన్ టెక్నాలజీతో హోండా సీబీ300 ఎఫ్ ట్విస్టర్
ఫ్లెక్స్-వన్ టెక్నాలజీతో హోండా సీబీ300 ఎఫ్ ట్విస్టర్
భారత్, ఆఫ్ఘనిస్తాన్ టీ20 సిరీస్ షెడ్యూల్‌లో మార్పులు.. ఎందుకంటే?
భారత్, ఆఫ్ఘనిస్తాన్ టీ20 సిరీస్ షెడ్యూల్‌లో మార్పులు.. ఎందుకంటే?
ఎంజీ నుంచి సరికొత్త 7-సీటర్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ.. ఫీచర్లు ఇవే
ఎంజీ నుంచి సరికొత్త 7-సీటర్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ.. ఫీచర్లు ఇవే