Street Dogs: వీధి కుక్కలకు ఆశ్రయం కల్పిస్తున్నారు.. ఎక్కడో తెలుసా ?
ఈ మధ్య వీధి కుక్కలు అంటేనే చాలామంది హడలెత్తిపోతున్నారు. ఎప్పుడు, ఎవర్ని కరుస్తాయనో అని ఆందోళన చెందుతున్న పరిస్థితి నెలకొంది. అయితే గుజరాత్‌లో మాత్రం వీధి కుక్కలపై జాలి చూపిస్తున్నారు. వాటి కోసం ఏకంగా ఓ సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.

ఈ మధ్య వీధి కుక్కలు అంటేనే చాలామంది హడలెత్తిపోతున్నారు. ఎప్పుడు, ఎవర్ని కరుస్తాయనో అని ఆందోళన చెందుతున్న పరిస్థితి నెలకొంది. అయితే గుజరాత్‌లో మాత్రం వీధి కుక్కలపై జాలి చూపిస్తున్నారు. వాటి కోసం ఏకంగా ఓ సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. వివరాల్లోకి వెళ్తే రాజ్‌కోట్‌లో ఉన్న సద్భావన అనే వృద్ధాశ్రమం వీధి కుక్కల కోసం ఈ ఆశ్రమాన్ని ప్రారంభించింది. ఇందులో గాయపడినవి, అనారోగ్యంతో ఉన్నటువంటి కుక్కలకు నిర్వాహకులు ఆశ్రయం కల్పిస్తున్నారు. అలాగే వీటి కోసం 24 గంటలు ప్రత్యేకమైన సౌకర్యాలతో వైద్య సదుపాయాలు అందిస్తున్నారు.
ఇక జునగఢ్, అమ్రేలితో పాటు రాజ్‌కోట్ చుట్టుపక్కల ఉండే పలు గ్రామాల నుంచి స్థానికులు వీధి కుక్కలు తీసుకొస్తున్నారు. వాటికి తాము ఆశ్రయం కల్పిస్తూ జాగ్రత్తగా చూసుకుంటున్నామని శునకాల ఆశ్రమ నిర్వాహకుడు ఖుషీ పటేల్ తెలిపారు. రెండు నెలల క్రితమే 50 కుక్కలతో డాగ్ షెల్టర్‌ను ప్రారంభించామని..ప్రస్తుతం తమ వద్ద 135 వరకు కుక్కలు ఉన్నాయని పేర్కొన్నారు. కుక్కలను ఆహ్లాదంగా ఉంచేందుకు మ్యూజిక్ థెరపి లాంటివి కూడా అందిస్తున్నామని వెల్లడించారు.