థాంక్ గాడ్ రక్షించినందుకు.. సోనమ్ చేతిలో రాజాకి బదులుగా నేను మరణించే వాడిని అంటున్న యువకుడు.. ఎందుకంటే..

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన రాజా రఘువంశీ హత్య కేసు గురించి తెలిసిందే. హనీమూన్ కి వెళ్ళిన రఘు వంశీ, సోనమ్ ల కథ ఓ సినిమా స్టోరీని తలపిస్తున్న రియల్ స్టోరీ. అయితే ఇప్పుడు మరొక సంఘటన వెలుగులోకి వచ్చి ఆశ్చర్య పరుస్తోంది. సోనమ్ చేతిలో మరణించాల్సి వ్యక్తిని నేనే.. దేవుడి దయవలన అదృష్టవశాత్తు నేను రక్షించబడ్డాను.. రఘువంశీకి మరణించాడు అని ధార్ వ్యాపారవేత్త సంచలన వ్యాఖ్యలు చేశాడు. అంతేకాదు సోనమ్ జీవితంలో ఉన్న మరో రహస్యాన్ని వెల్లడించాడు. తనకు సోనమ్ పెళ్లి కుదిరింది..అయితే జ్యోతిష్కుడి సలహాతో పెళ్లిని క్యాన్సిల్ చేసుకున్నట్లు వెల్లడించాడు.

థాంక్ గాడ్ రక్షించినందుకు.. సోనమ్ చేతిలో రాజాకి బదులుగా నేను మరణించే వాడిని అంటున్న యువకుడు.. ఎందుకంటే..
Raja Raghuvanshi Murder Case

Updated on: Jun 19, 2025 | 11:32 AM

దేవుడి దయవల్ల నేను రక్షించబడ్డాను. లేకపోతే నేను ఈరోజు రాజా స్థానంలో ఉండేవాడిని… ఇలా చెబుతూ.. మధ్యప్రదేశ్‌లోని ధార్ నివాసి మయాంక్ రఘువంశీ వణికిపోయాడు. సోనమ్ వివాహం మొదట మయంక్ అనే యువకుడితో నిశ్చయం అయింది. వీరిద్దరికీ పెళ్ళికి ముహర్తం పెట్టె సమయంలో జాతకం చూసిన జ్యోతిష్కుడు.. మయాంక్ కుటుంబానికి ఏదో చెప్పాడు. దీంతో పెళ్లి సంబంధం క్యాన్సిల్ అయింది.

సోనమ్ రఘువంశీ అనేది నేడు అందరికీ తెలిసిన పేరు. ఆమె తన ప్రియుడి కోసం కట్టుకున్న భర్తని అత్యంత దారుణంగా హత్య చేసి జైలు పాలైంది. ఆమె చేసిన పని చూసి దేశం మొత్తం ఆశ్చర్యపోయింది. నిజానికి.. సోనమ్ తన ప్రియుడిని వివాహం చేసుకోవడానికి పెళ్లైన కొన్ని రోజులకే భర్తని హత్య చేసింది. ఈ హత్యకు సూత్రధారి సోనమ్ ప్రియుడు రాజ్ కుష్వాహా. ఈ కేసులో మొత్తం ఐదుగురుని అరెస్టు చేశారు. సోనమ్ చేసిన హత్య గురించి.. అది కూడా ప్రేమికుడి పెళ్లి చేసుకోవడానికి దారుణంగా భర్తని హత్యచేయించింది అని తెలియగానే.. సోనమ్ గురించి మరికొన్ని విశేషాలు వెలుగులోకి వస్తున్నాయి.

సోనమ్ కి సంబంధించిన ఏడాదిన్నర నాటి క్రితం కథ ఇది. మధ్యప్రదేశ్‌లోని ధార్ జిల్లాకు చెందిన సోనమ్ కి ఒక పెళ్లి ప్రతిపాదన వచ్చింది. ఈ కుటుంబం ఒక వ్యాపారవేత్తది. ఈ ప్రతిపాదన నానేవాడిలో నివసిస్తున్న వ్యాపారవేత్త హరీష్ కుమారుడు మయాంక్ ది. మయాంక్ మామ సోనమ్ గురించి చెప్పి పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చాడు. ఆ తర్వాత రెండు కుటుంబాల మధ్య పెళ్లి చేసే విషయంలో మరింత ముందుకు వెళ్ళారు.

ఇవి కూడా చదవండి

రెండు కుటుంబాలు కలిశాయి. తర్వాత గణాలు జత కలిశాయి. మయాంక్ , సోనమ్‌లకు 25 సరిపోలిక గణాలు ఉన్నాయి. దీనితో ఇరువురి కుటుంబ సభ్యులు సంతోషంగా ఇద్దరి వివాహ తేదీని కూడా నిర్ణయించారు. అయితే ఈ లోగా వరుడి కుటుంబ సభ్యులు సోనమ్ .. మయాంక్ కుండలిని తమకు తెలిసిన జ్యోతిష్కుడికి చూపించారు. అప్పుడు మయాంక్ జ్యోతిష్కుడు వీరికి పెళ్లి చేస్తే ఈ సంబంధం ఎక్కువ కాలం ఉండదు. ఏదైనా అవాంఛనీయ సంఘటన జరగవచ్చు. దీని వల్ల మీ కుటుంబం మొత్తం బాధపడుతుంది అని మయాంక్ కుటుంబానికి చెప్పాడు. అంతేకాదు ఈ పెళ్లి జరిగితే.. ఈ సంబంధం మిమ్మల్ని తీవ్రమైన పరిస్థితిలో పడేస్తుందని హెచ్చరించాడు.

పెళ్లిని క్యాన్సిల్ చేసిన మయాంక్ ఫ్యామిలీ

జ్యోతిష్కుడు చెప్పిన విషయాలు విన్న మయాంక్ , అతని కుటుంబం దిగ్భ్రాంతి చెందారు. వారు చాలా ఆలోచించి ఆ సంబంధం వద్దని తిరస్కరించారు. మయాంక్ ఫ్యామిలీ పెళ్ళికి నో చెప్పిన తరువాత సోనమ్ కి రాజాకి ఫిబ్రవరిలో సోనమ్ నిశ్చితార్థం జరిగింది. పెళ్లి తర్వాత రాజా విషయంలో ఏమి జరిగిందో అందరికీ తెలిసిందే.

‘దేవునికి ధన్యవాదాలు నేను బ్రతికాను, లేకపోతే…’

రాజా రఘువంశీ హత్య కేసులో సోనమ్ రఘువంశీ ప్రమేయం ఉందని తెలుసుకున్న మయాంక్ షాక్ అయ్యాడు. అతను ఇలా అన్నాడు.. దేవుడి దయవల్ల నేను బతికాను. లేకుంటే నేను ఈరోజు రాజా స్థానంలో ఉండేవాడిని. జ్యోతిష్కుడు నన్ను కాపాడాడు. అయితే రాజా కుటుంబానికి న్యాయం జరగాలని తాను కోరుకుంటున్నానని చెప్పాడు.

 

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..