కర్నాటక ఆర్టీసీ కొత్తగా 20 “ఐరావత క్లబ్ క్లాస్” బస్సుల్ని లాంచ్ చేసింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం సిద్ధరామయ్యతోపాటు, DK శివకుమార్ పాల్గొన్నారు. అక్కడ మీటింగ్‌లో ఉచిత బస్సు ప్రయాణంపై ఈ వ్యాఖ్యలు చేశారు. టిక్కెట్టు కొనుక్కుని వెళ్లేందుకు మహిళలు ముందుకు వస్తున్న నేపథ్యంలో.. రవాణా శాఖ మంత్రి రామలింగారెడ్డితో మాట్లాడి దీనిపై ఓ నిర్ణయం తీసుకుంటామన్నారు. ట్వీట్ల ద్వారాను, ఈ-మెయిళ్ల ద్వారాను చాలా మంది తమ అభిప్రాయం చెప్తున్నారని DK అన్నారు. 5 నుంచి 10 శాతం మంది ఫ్రీ వద్దు అంటున్నారన్నారు DK. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. విపక్షాలకు మరో విమర్శనాస్త్రంగా మారింది.
ఇక్కడ క్లిక్ చేయండి..
2023 జూన్‌లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక గ్యారంటీల అమల్లో భాగంగా ఉచిత బస్సు పథకాన్ని మొదలుపెట్టారు. ఈ శక్తి స్కీమ్ వల్ల ప్రభుత్వంపై ఏటా 7 వేల 600 కోట్ల వరకూ భారం పడుతోంది. దీని నుంచి తప్పించుకునేందుకే ఇలా చేస్తున్నారనేది విపక్షాల విమర్శ. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం DK శివకుమార్ వ్యాఖ్యల నేపథ్యంలో ఉచిత బస్సు పథకం అమలుపై నెక్స్ట్‌ఏ దిశగా అడుగులు పడుతున్నాయనే ఉత్కంఠ కనిపిస్తోంది.