‘చాంబర్స్‌లో విచారిస్తాం’.. సీజేఐ జస్టిస్ ఎస్.ఎ.బాబ్డే..
సీఐఏను సవాలు చేస్తూ భారీగా పిటిషన్లు దాఖలయ్యాయని, అందువల్ల కొన్ని చిన్న చిన్న అంశాలను తాము చాంబర్స్‌లో విచారించే అవకాశాలు ఉన్నాయని చీఫ్ జస్టిస్ ఎస్.ఎ. బాబ్డే అన్నారు. న్యాయవాదులు ఈ ఛాంబర్స్ కు వచ్చి తమ వాదనలను వినిపించవచ్ఛునన్నారు. ఒక విధంగా ప్రొసీజరల్ (విధానపరమైన) అంశాలను ఇలా ఇన్-ఛాంబర్ లో విచారించడమే మేలని ఆయన అభిప్రాయపడ్డారు. నిజానికి ఈ చట్టం ఈ దేశంలోని ప్రతి వ్యక్తి మనసులో కీలకమైనదిగా మెదలుతోందన్నారు. సీఏఏను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో […]
సీఐఏను సవాలు చేస్తూ భారీగా పిటిషన్లు దాఖలయ్యాయని, అందువల్ల కొన్ని చిన్న చిన్న అంశాలను తాము చాంబర్స్‌లో విచారించే అవకాశాలు ఉన్నాయని చీఫ్ జస్టిస్ ఎస్.ఎ. బాబ్డే అన్నారు. న్యాయవాదులు ఈ ఛాంబర్స్ కు వచ్చి తమ వాదనలను వినిపించవచ్ఛునన్నారు. ఒక విధంగా ప్రొసీజరల్ (విధానపరమైన) అంశాలను ఇలా ఇన్-ఛాంబర్ లో విచారించడమే మేలని ఆయన అభిప్రాయపడ్డారు. నిజానికి ఈ చట్టం ఈ దేశంలోని ప్రతి వ్యక్తి మనసులో కీలకమైనదిగా మెదలుతోందన్నారు. సీఏఏను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో 143 పిటిషన్లు దాఖలైన నేపథ్యంలో.. ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే ఇన్ని పిటిషన్లలో సుమారు 60 పిటిషన్ల కాపీలను ప్రభుత్వానికి అందజేశారని కేంద్రం తరఫున అటార్నీ జనరల్ కె.కె.వేణుగోపాల్ తెలిపారు. తమకు ఇంకా అందని కాపీలపై స్పందించడానికి మరింత వ్యవధి కావాలని ఆయన కోరారు. మరోవైపు-సీఏఏ అమలు కాకుండా నిలుపుదల చేయాలని , ప్రస్తుతానికిఎన్ పీ ఆర్ ని వాయిదా వేయాలని సీనియర్ లాయర్ కపిల్ సిబల్ అభ్యర్థించారు.
ఇలా ఉండగా..సంబంధిత కేసుల విచారణకు 5 గురు జడ్జీలతో కూడిన ధర్మాసనం షెడ్యూలును రూపొందిస్తుందని తెలుస్తోంది. ఆయా పిటిషన్లపై తాము నిర్ణయం తీసుకునేంతవరకు అన్ని హైకోర్టులు వాటిపై విచారణను నిలిపివేయాలని అత్యున్నత ధర్మాసనం సూచించింది. సీఏఏపై కేసుల కేటగిరీలను కోర్టు ఏర్పాటు చేయడం విశేషం. వేర్వేరు అంశాలపై కోర్టు ప్రాథమిక ఉత్తర్వులను జారీ చేయనుంది.