Moon and Venus: ఆకాశంలో అద్భుత దృశ్యం.. చంద్ర-శుక్ర సంయోగం.. మళ్ళీ ఈనెల 28న ఐదు గ్రహాలు ఒకే చోట కలిసే అరుదైన దృశ్యం

|

Mar 25, 2023 | 11:46 AM

సౌరకుంటుంబంలో అత్యంత ప్రకాశవంతమైన శుక్రుడు చంద్రునికి అత్యంత సమీపంగా వచ్చి కనువిందు చేసింది. ఈ శుక్ర-చంద్ర సంయోగం ఒక అద్భుతం అంటున్నారు ఖగోళ శాస్త్రవేత్తలు.

Moon and Venus: ఆకాశంలో అద్భుత దృశ్యం.. చంద్ర-శుక్ర సంయోగం.. మళ్ళీ ఈనెల 28న ఐదు గ్రహాలు ఒకే చోట కలిసే అరుదైన దృశ్యం
Venus And Moon
Follow us on

ప్రకృతిలో మానవ మేధస్సుకు అందని అనేక వింతలు విశేషాలున్నాయి. నేల,నింగి, నీరు అన్నింటా వింతలే.. అవి ఆవిష్కృతం అవుతుంటే మనసు పులకిస్తుంది. తాజాగా ఆకాశంలో అద్భుతం చోటుచేసుకుంది. మార్చి 24న పవిత్ర రంజాన్‌ మాసం ప్రారంభమైన వేళ ఆకాశంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. చంద్ర, శుక్ర గ్రహాల సంయోగం జరిగింది. సౌరకుంటుంబంలో అత్యంత ప్రకాశవంతమైన శుక్రుడు చంద్రునికి అత్యంత సమీపంగా వచ్చి కనువిందు చేసింది. ఈ శుక్ర-చంద్ర సంయోగం ఒక అద్భుతం అంటున్నారు ఖగోళ శాస్త్రవేత్తలు. ఈ అద్భుతం మార్చి 24 శుక్రవారం సాయంత్రం 4 గంటల 45 నిమిషాలకు ప్రారంభమై ఐదున్నర గంటలకు ముగిసింది. దీనిని ప్రముఖ పర్యాటక కేంద్రం లద్దాక్‌లోని అన్‌లే అబ్జర్వేటరీలో పరిశీలించారు శాస్త్రవేత్తలు.  ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఈ అద్భుత దృశ్యం కనిపించగా పలువురు తమ మొబైల్‌ ఫోన్లలో భద్రపరచుకున్నారు.

సౌర వ్యవస్థతో పాటు 9 గ్రహాలు.. వాటిలోని అద్భుతాలు రహస్యాలు మానవాళిని అబ్బురపరుస్తూనే ఉన్నాయి. ఈ రాత్రి ఆకాశంలో అరుదైన సంయోగాలలో ఒకటి శుక్రుడు చంద్రుని వెనుక ‘అదృశ్యమవుతున్నట్లు’ అనిపించింది. అవును రాత్రి వేళ ఆకాశంలో చూసినప్పుడు చంద్రునికి కింది భాగంలో అతి సమీపంగా ఓ చుక్క కనిపించిందని, అదే శుక్రగ్రహంగా శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఈ రెండూ చాలా దగ్గరగా కనిపించినా వాస్తవానికి వాటి మధ్య దూరం 18.54 కోట్ల కిలోమీటర్లు ఉంటుందని తెలిపారు.

శుక్రుడు సౌర వ్యవస్థలోని ప్రకాశవంతమైన గ్రహాలలో ఒకటి. ఎందుకంటే 70% సూర్యరశ్మిని తిరిగి ప్రతిబింబిస్తుంది. భూమికి దగ్గరగా ఉండే గ్రాహం. కాగా ఈ అద్భుత దృశ్యాన్ని మార్చి 25 అంటే శనివారం కూడా వీక్షించవచ్చని ప్లానెటరీ సొసైటీ ఆఫ్ ఇండియా డైరెక్టర్ ఎన్. శ్రీరఘునందన్ తెలిపారు. ఇలాంటి వింతలు ఈ ఏడాది ఆగస్టు వరకూ కొనసాగుతాయని తెలిపారు.

ఇవి కూడా చదవండి

మార్చి 28న బృహస్పతి, బుధుడు, శుక్రుడు, యురేనస్, అంగారకుడు ఈ ఐదు గ్రహాలు ఒకచోట చేరి ఆకాశంలో అరుదైన దృశ్యాన్ని సృష్టిస్తాయని CBS న్యూస్ నివేదించింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..