AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రపంచ కుబేరుడితో కేంద్రమంత్రి..! ఇద్దరి ముచ్చట్లు అదుర్స్..!

సోషల్ మీడియా.. ఇప్పుడు ప్రతి ఒక్కరూ వినియోగిస్తున్న మాధ్యమం. సామాన్య జనమే కాదు.. వీఐపీలు.. సెలబ్రిటీలు, రాజకీయనాయకులు కూడా దీనిని చాలా ఉపయోగిస్తూ.. వారి అభిమానులకు దగ్గరవుతున్నారు. అంతేకాదు.. దీని వేదికగానే చిన్న కామెంట్స్‌తో పెద్ద విషయాన్ని చెప్పేస్తారు. ఇక మన దేశంలో అయితే.. బీజేపీకి సంబంధించిన నేతలు, మంత్రులు ఎక్కువగానే ఉపయోగిస్తారు. అందులో ముఖ్యంగా కేంద్రమంత్రి స్మృతి ఇరానీ గురించి చెప్పక్కర్లేదు. ఆమె సోషల్ మీడియాలో ఎంత చురుకుగా ఉంటుందో అందరికీ తెలిసిందే. అయితే ఆమె […]

ప్రపంచ కుబేరుడితో కేంద్రమంత్రి..! ఇద్దరి ముచ్చట్లు అదుర్స్..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Nov 20, 2019 | 4:02 PM

Share

సోషల్ మీడియా.. ఇప్పుడు ప్రతి ఒక్కరూ వినియోగిస్తున్న మాధ్యమం. సామాన్య జనమే కాదు.. వీఐపీలు.. సెలబ్రిటీలు, రాజకీయనాయకులు కూడా దీనిని చాలా ఉపయోగిస్తూ.. వారి అభిమానులకు దగ్గరవుతున్నారు. అంతేకాదు.. దీని వేదికగానే చిన్న కామెంట్స్‌తో పెద్ద విషయాన్ని చెప్పేస్తారు. ఇక మన దేశంలో అయితే.. బీజేపీకి సంబంధించిన నేతలు, మంత్రులు ఎక్కువగానే ఉపయోగిస్తారు. అందులో ముఖ్యంగా కేంద్రమంత్రి స్మృతి ఇరానీ గురించి చెప్పక్కర్లేదు. ఆమె సోషల్ మీడియాలో ఎంత చురుకుగా ఉంటుందో అందరికీ తెలిసిందే. అయితే ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో మంగళవారం పెట్టిన ఓ పోస్ట్.. ఇప్పుడు వైరల్‌గా మారింది.

మైక్రోసాఫ్ట్ అధినేత, ప్రపంచ కుబేరుడు బిల్‌గేట్స్‌.. భారత పర్యటనకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ఆయనతో కలిసి భారతీయ పోషణ్‌ కృషి కోష్‌ అనే కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే ఈ సందర్భంగా బిల్‌గేట్స్‌తో కలిసి ఓ ఫోటో దిగారు. అనంతరం ఆ ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. అంతేకాదు ఆ ఫోటోకు ఓ మెసెజ్‌‌ను జతచేస్తూ కామెంట్ పెట్టారు. “మనం డిగ్రీ పూర్తి చేయలేదు కదా.. ఇప్పుడేం చేద్దాం” అంటూ ఫోటోను ఉద్దేశించి ముచ్చటించినట్లు పోస్ట్ పెట్టారు.

అయితే కేంద్రమంత్రి కామెంట్స్‌పై కాసేపు ట్రోలింగ్ జరగగా.. అసలు విషయం అందరికీ కాస్త లేటుగా అర్థమైంది. అదేంటంటే.. ఇద్దరు కూడా కనీసం గ్రాడ్యూయేషన్ పూర్తి చేయలేదు. డిగ్రీకూడా పూర్తిచేయని బిల్‌గేట్స్‌ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు.. కాగా ఇక స్మతి ఇరానీ ప్రస్తుతం కేంద్రమంత్రిగా ఉన్నారు. అంటే పట్టుదల, కృషి ఉంటే సాధించనిది ఏమీ లేదని.. చదువు ఉన్నా.. లేకున్నా.. ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని ఈ ఫోటో అర్థాన్ని తెల్పుతుంది అంటూ కొందరు నెటిజన్లు కామెంట్లు పెట్టారు.

View this post on Instagram

सोच रहे हैं पढ़ाई पूरी करी नहीं , आगे क्या करें ?

A post shared by Smriti Irani (@smritiiraniofficial) on

Follow Us
ఇప్పుడే కెరీర్ స్టార్ట్ చేయండి: ఫ్రెషర్స్ కోసం టాప్ జాబ్స్..
ఇప్పుడే కెరీర్ స్టార్ట్ చేయండి: ఫ్రెషర్స్ కోసం టాప్ జాబ్స్..
ఉదయాన్నే వేడి నీళ్లు తాగేముందు ఈ పచ్చి నిజాలు తెలుసుకోండి..
ఉదయాన్నే వేడి నీళ్లు తాగేముందు ఈ పచ్చి నిజాలు తెలుసుకోండి..
అమావాస్య రోజు ఈ ఒక్క పని చేస్తే చాలు మీ దశ తిరిగినట్లే!
అమావాస్య రోజు ఈ ఒక్క పని చేస్తే చాలు మీ దశ తిరిగినట్లే!
మీ ఇంట్లో ఈ మొక్క ఉందా.. సరైన ప్లేస్‌లో పెట్టకపోతే మీకు తిప్పలు..
మీ ఇంట్లో ఈ మొక్క ఉందా.. సరైన ప్లేస్‌లో పెట్టకపోతే మీకు తిప్పలు..
కోడి గుడ్డు కొబ్బరి మసాలా కర్రీ.. ఒక్కసారి ఇలా వండి తిన్నారంటే..
కోడి గుడ్డు కొబ్బరి మసాలా కర్రీ.. ఒక్కసారి ఇలా వండి తిన్నారంటే..
పాములు తమ ఎరను ఎంత దూరం నుంచి చూడగలవో తెలుసా?
పాములు తమ ఎరను ఎంత దూరం నుంచి చూడగలవో తెలుసా?
నెలకు రూ.85 వేలు ఇస్తే నా భర్తను నీకిస్తా.. భార్య బంపర్ ఆఫర్..
నెలకు రూ.85 వేలు ఇస్తే నా భర్తను నీకిస్తా.. భార్య బంపర్ ఆఫర్..
వేసవిలో కొబ్బరి నీళ్లు తాగడం మంచిదేనా? నిపుణులు ఏం చెబుతున్నారంటే
వేసవిలో కొబ్బరి నీళ్లు తాగడం మంచిదేనా? నిపుణులు ఏం చెబుతున్నారంటే
ఇంట్లోనే డబ్బు పెంచే మార్గం.. గుప్పెడు బియ్యం సీక్రెట్!
ఇంట్లోనే డబ్బు పెంచే మార్గం.. గుప్పెడు బియ్యం సీక్రెట్!
Nellore: నెల్లూరులో అందరినీ అవాక్కయ్యేలా చేసిన చోరీ
Nellore: నెల్లూరులో అందరినీ అవాక్కయ్యేలా చేసిన చోరీ