రద్దీగా ఉండే మార్కెట్లో మళ్లీ దట్టమైన పొగలు.. వెంటనే ఫైర్‌ స్టేషన్‌కి కాల్‌ చేసిన స్థానికులు.. ఎక్కడంటే..

|

Jan 24, 2023 | 8:12 AM

సదరు దుకాణదారుడితో పాటు చుట్టుపక్కల దుకాణాల వారిని కూడా పిలిపించి పలు అగ్నిప్రమాద నివారణ చర్యలను వివరించారు. ప్రమాదాల పట్ల తగిన అవగాహన కలిగి ఉండాలని సూచించారు.

రద్దీగా ఉండే మార్కెట్లో మళ్లీ దట్టమైన పొగలు.. వెంటనే ఫైర్‌ స్టేషన్‌కి కాల్‌ చేసిన స్థానికులు.. ఎక్కడంటే..
Shimla Fire News
Follow us on

చలికాలంలో అగ్ని ప్రమాదాలు పెరుగుతున్నాయి. అటువంటి పరిస్థితిలో, అగ్నిమాపక విభాగం కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. మొన్నటికి మొన్న హైదరాబాద్‌ నగరంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. వ్యాపార సముదాయ ప్రాంతంలోని ఓ షోరూమ్‌లో అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు సజీవ దహనమయ్యారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ క్రమంలోనే హిమాచల్ ప్రదేశ్ లోని సిమ్లాలోని లోయర్ బజార్‌లో ఓ ఆసక్తికరమైన కథనం వెలుగులోకి వచ్చింది. మార్కెట్‌లో నల్లటి పొగలు రావడంతో దుకాణదారులు భయాందోళనకు గురయ్యారు. పెద్ద ప్రమాదం జరగకుండా చుట్టుపక్కల వారు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. పది నిమిషాల వ్యవధిలో అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అయితే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకోగా అక్కడ కనిపించిన సీన్‌ చూసి కంగుతిన్నారు. ఇదేంట్రా బాబు అని అవాక్కయ్యారు. జరిగిన ఘటనతో అందరూ నోరెళ్లబెట్టారు. ఇంతకీ ఏం జరిగిందంటే..

సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక శాఖ అధికారులు, సిబ్బంది విస్తుపోయారు. వాస్తవానికి దుకాణంలో ఎలాంటి మంటలూ వ్యాపించలేదు. బదులుగా ఒక వ్యక్తి దుకాణంలో కొన్ని కార్డ్‌బోర్డ్‌లను సేకరించి మంటపెడుతున్నాడు. దుకాణదారుడు కొన్ని కార్డ్‌బోర్డ్, కాగితాన్ని సేకరించి దుకాణం లోపల మంటలను వెలిగించాడు. దీంతో మార్కెట్ మొత్తం నల్లటి పొగ కమ్ముకుంది. ఇది చూసి సమీపంలోని దుకాణదారులు షాపులో మంటలు చెలరేగి ఉంటాయని భావించారు. వెంటనే ఫైర్‌ సిబ్బందికి కాల్‌ చేసి అలర్ట్‌ చేశారు. అగ్నిమాపక సిబ్బంది, వారితో పాటు ఘటనా స్థలానికి చేరుకున్న ప్రజలు ఇదంతా చూసి అవాక్కయ్యారు.

అగ్నిప్రమాదం జరిగిన వెంటనే అగ్నిమాపక శాఖ బృందం సంఘటనా స్థలానికి చేరుకుందని సిమ్లా అగ్నిమాపక స్టేషన్ ఆఫీసర్ మాన్సారామ్ తెలిపారు. కానీ, సంఘటనా స్థలంలో చలి నుంచి ఉపశమనం కోసం ఓ దుకాణదారుడు నిప్పుపెట్టినట్లు తెలిసింది. చలి మంటలు వేసుకోవటానికి ఇలా దుకాణం లోపల నిప్పంటించవద్దని ఫైర్‌ సిబ్బంది దుకాణదారుడికి సూచించారు. రద్దీగా ఉండే మార్కెట్‌లో ఇలాంటివి ప్రమాదాలకు దారితీస్తాయని చెప్పారు. ఎలక్ట్రిక్ ట్రాన్స్ఫార్మర్లు కూడా మార్కెట్లో ఎక్కువగా ఉంటాయని కాబట్టి మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని చెప్పారు. సదరు దుకాణదారుడితో పాటు చుట్టుపక్కల దుకాణాల వారిని కూడా పిలిపించి పలు అగ్నిప్రమాద నివారణ చర్యలను వివరించారు. ప్రమాదాల పట్ల తగిన అవగాహన కలిగి ఉండాలని సూచించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..