10 మంది భార్యలు, ఆరుగురు గర్ల్‌ఫ్రెండ్‌లు, జాగ్వార్ కారుని డ్రైవింగ్ చేయడం, విమానంలో ప్రయాణించడం, 5 స్టార్ హోటల్‌లో బస చేయడం ఇవన్నీ ఓ పెద్ద పారిశ్రామికవేత్తకు సంబంధించిన విషయాలు కావు. ఒక ఘరానా దొంగకు సంబంధించిన విషయాలు. అంతేకాదు ఈ దొంగ భార్యల్లో ఒకరు బీహార్‌లోని సీతామర్హిలో జిల్లా పంచాయతీ సభ్యురాలు. పొలిటికల్ లీడర్. మరో భార్య సినిమా హీరోయిన్. భోజ్‌పురి సినిమాల హీరోయిన్ నటిస్తుంది. ముంబైలో ఉంటుంది. నేరం చేసేందుకు వెళ్లే సిటీలో ముందుగా ఓ అమ్మాయిని ఇంప్రెస్ చేసి ఆ తర్వాత ఆ యువతిని పెళ్లి చేసుకోవడం ఈ దొంగ స్పెషాలిటీ.
రెండేళ్ల క్రితం ఈ దొంగను ఘజియాబాద్‌లోని కవినగర్ కొత్వాలి పోలీసులు అరెస్టు చేశారు. ఈ దొంగ జాగ్వార్ కారును కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కారు అతని భార్య పేరు మీద రిజిస్టర్ చేయబడింది. బీహార్‌లోని సీతామర్హికి చెందిన ఈ దొంగను మహ్మద్ ఇర్ఫాన్ అలియాస్ ఉజాలేగా గుర్తించారు. వాస్తవంగా ఈ దొంగ పెళ్ళిళ్ళు భార్యల గురించి చెప్పాలంటే.. ఉజాలేకు ఎంత మంది భార్యలు ఉన్నారో అతనికి కూడా ఖచ్చితంగా తెలియదు. అయితే పోలీసుల విచారణలో 10 మంది భార్యలు , ఆరుగురు ప్రియురాళ్ళు వెలుగులోకి వచ్చారు. పేర్ల జాబితా వెలుగులోకి వచ్చింది. ఎందుకంటే కొంత మంది గర్ల్‌ఫ్రెండ్స్ ను ఒక్కసారి తప్ప మళ్ళీ కలవలేదు.. ఎందుకంటే అతను ఎక్కడైనా నేరం చేయడానికి వెళ్తే.. అక్కడ ఓ అమ్మాయితో స్నేహం చేస్తాడు. ఆతర్వాత ఆ యువతి గురించి మరచి పోతాడు. ప్రపంచం దృష్టిలో మొహమ్మద్ ఇర్ఫాన్ దొంగ కావచ్చు.. అయితే అతడిని ఊరి ప్రజలు మాత్రం దేవుడిగా భావిస్తారు.
మహ్మద్ ఇర్ఫాన్ ఎక్కడెక్కడో దొంగతనాలు చేసి అలా దోచుకున్న డబ్బులో ఎక్కువ భాగం తన ఊరి అభివృద్ధికే వెచ్చించాడు. గ్రామంలోని రోడ్లన్నీ బాగు చేశాడు. గ్రామంలో విద్యుత్ సౌకర్యం కల్పించాడు. పలు అభివృద్ధి పనులు చేశాడు. ఇర్ఫాన్ భార్య మొదటిసారి ఎన్నికల్లో అప్రతిహతంగా విజయం సాధించడానికి.. ముఖ్యంగా రెండోసారి కూడా భారీ మెజార్టీతో గెలుపొందడానికి కారణం ఇదే. పోలీసు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇర్ఫాన్ ఎప్పుడూ పెద్ద పెద్ద దొంగతనాలే చేసేవాడు.
దొంగతనం చేయాలనుకున్న నగరంలో రెక్కీ నిర్వహించే వాడు. 10 రోజుల పాటు నగరంలోనే ఉండి విలాసవంతమైన ఇళ్లకు వెళ్లేవాడు. ఈ కాలంలో అవకాశం దొరికినప్పుడల్లా లక్షల కోట్ల విలువైన వస్తువులతో పరారీ అయఎవాడు. బీహార్ నుండి ఢిల్లీకి తన జాగ్వార్ కారులో ప్రయాణించేవాడు. ఎక్కువ దూరం అయితే విమానంలో ప్రయాణించేవాడు. సాధారణంగా అతను ఏ నగరానికి వెళ్లినా, అతను 5 స్టార్ హోటల్‌లో బస చేసేవాడు. మహ్మద్ ఇర్ఫాన్ మెరిసే బట్టలు ధరించడానికి ఇష్టపడేవాడు. పారిశ్రామికవేత్త ఆర్యన్ ఖన్నాగా తన గురించి పది మందికి చెప్పేవాడు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..