AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pralhad Joshi: సీఎంగా బాధ్యతలు స్వీకరించిన ఒమర్‌ అబ్దుల్లా.. ప్రహ్లాద్ జోషి కీలక కామెంట్స్

జమ్మూ కాశ్మీర్‌లో కొత్త సర్కార్ కొలువుదీరడంపై కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి కీలక కామెంట్స్ చేశారు. ప్రజల తీర్పును తాము గౌరవిస్తామని చెప్పారు. ఎన్నికల్లో 6 సీట్లకు పరిమితమైన కాంగ్రెస్ గురించి మాట్లాడకపోవడమే మంచిదని వ్యాఖ్యానించారు.

Pralhad Joshi: సీఎంగా బాధ్యతలు స్వీకరించిన ఒమర్‌ అబ్దుల్లా.. ప్రహ్లాద్ జోషి కీలక కామెంట్స్
Pralhad Joshi
Ram Naramaneni
|

Updated on: Oct 16, 2024 | 5:10 PM

Share

జమ్మూ కాశ్మీర్‌లో కొత్త సర్కార్ కొలువుదీరింది. సీఎంగా నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు మంత్రివర్గ సహచరులు ప్రమాణం చేశారు. జమ్మూ కాశ్మీర్ లెప్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా వారితో ప్రమాణ స్వీకారం చేయించారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్- కాంగ్రెస్ పార్టీ కూటమి ఇక్కడ విజయం సాధించింది. మొత్తం 90 నియోజకవర్గాలు ఉన్న జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో నేషనల్ కాన్ఫరెన్స్ 42, కాంగ్రెస్-6 స్థానాలను గెలుచుకున్నాయి. బీజేపీ 29 సీట్లలో విజయం సాధించింది. పీడీపీ మూడు స్థానాలకు పరిమితమైంది. 10 స్థానాల్లో ఇతరులు గెలుపొందారు. అందులో ఒకరు ఆప్ అభ్యర్థి ఉన్నారు. సీఎం ఒమర్ అబ్దుల్లా ప్రమాణ స్వీకారోత్సవంపై కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి స్పందించారు.  “కాశ్మీర్ ప్రజలకు ఎన్నికలు ప్రజాస్వామ్య పండుగ, బీజేపీ అక్కడ ప్రధాన ప్రతిపక్ష పార్టీగా అవతరించింది.  మేము ప్రజల మాండేట్‌ను గౌరవిస్తాము. కాంగ్రెస్ ఎన్నికల్లో ఎక్కడా కనిపించని పార్టీ. కేవలం 6 సీట్లు మాత్రమే గెలుచుకుంది. హర్యానాలో ప్రధాని మోదీ నేతృత్వంలో బీజేపీ వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోంది…’’ అని వ్యాఖ్యానించారు.

మరోవైపు కర్నాటకలో మైసూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ముడా) ఛైర్మన్ కె. మరిగౌడ రాజీనామాపై ప్రహ్లాద్ జోషి కీలక వ్యాఖ్యలు చేశారు “ఈ స్కామ్‌లో లబ్ధిదారుడు ముఖ్యమంత్రే. ముడా కుంభకోణంలోనే కాదు.. వాల్మీకి బోర్డు కుంభకోణంలో కూడా ఆయన పాత్ర ఉంది.. కర్ణాటక హైకోర్టు వ్యాఖ్యల తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ ఆయనను పదవి నుంచి దిగిపోవాలని చెప్పకపోవడం హాస్యాస్పదం. కాంగ్రెస్  హైకమాండ్‌కు అన్ని కుంభకోణాలలో ప్రమేయం ఉంది. అగ్రనేతలు అవినీతిపై బెయిల్‌పై ఉన్న విషయం తెలిసిందే. కర్ణాటక సిఎం రాజీనామా కోసం బీజేపీ పోరాడుతుంది ” అని ప్రహ్లాద్ జోషి చెప్పారు. 

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..
మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..
రాత్రుళ్లు ఈ ప్రదేశాలు మహాద్భుతం.. హాలీవుడ్ భవనాలను తలపిస్తాయి..
రాత్రుళ్లు ఈ ప్రదేశాలు మహాద్భుతం.. హాలీవుడ్ భవనాలను తలపిస్తాయి..