Viral Video: వీధుల్లోని వరద నీటిలో మానిటర్ బల్లి సంచారం.. హడలెత్తిన జనం.. షాకింగ్ వీడియో.!

Shocking Video of Monitor Lizard: బంగాళాఖాతంలో ఏర్పడిన యాస్ తుఫాన్ పశ్చిమ బెంగాల్‌లో విధ్వంసం సృష్టించిన సంగతి తెలిసిందే...

Viral Video: వీధుల్లోని వరద నీటిలో మానిటర్ బల్లి సంచారం.. హడలెత్తిన జనం.. షాకింగ్ వీడియో.!
Crocodile
Follow us
Ravi Kiran

|

Updated on: May 27, 2021 | 2:18 PM

Shocking Video of Monitor Lizard: బంగాళాఖాతంలో ఏర్పడిన యాస్ తుఫాన్ పశ్చిమ బెంగాల్‌లో విధ్వంసం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ సైక్లోన్ ధాటికి ఆ రాష్ట్రంలోని పలు ప్రాంతాలు నీటి మునిగాయి. ఇక తుఫాన్ ప్రభావిత ప్రాంతాల ప్రజలను హడలెత్తించేలా తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో ఓ మానిటర్ బల్లి రోడ్డుపై తిరుగుతూ కనిపించింది. ఆ వివరాలు..

తుఫాన్ దాటికి పలు ప్రాంతాలు నీట మునగడంతో సముద్రంలోని మొసళ్లు, మానిటర్‌ బల్లులు వరదలో నుంచి కొట్టుకొచ్చి, ఇళ్ల ముందు దర్శనమిస్తున్నాయి. ఇక తాజాగా కోల్‌కతా నగరంలోని దమ్‌ దమ్‌ ఏరియాలో మానిటర్‌ బల్లి తిరుగుతూ కనిపించింది. ఈ మానిటర్‌ బల్లితో పాటు మొసళ్లు కూడా వరద నీటిలో అటుఇటు తిరుగుతుండటంతో అక్కడి ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలను అటవీ శాఖ అధికారి ప్రవీణ్ అంగుసామీ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. అది కాస్తా వైరల్ కావడంతో విషయం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు వెంటనే స్పాట్‌కు చేరుకుని, ఓ మానిటర్‌ బల్లితో పాటు ఓ మొసలిని పట్టుకున్నారు.

Also Read:

మామిడి పండ్లు తిని ఈ 5 ఆహార పదార్ధాలను అస్సలు తినకండి.. చాలా డేంజర్.! ఎందుకంటే?

టీకా తీసుకుంటే రెండేళ్లలో చనిపోతారా.? నెట్టింట్లో వైరల్ పోస్ట్.. అసలు నిజం ఏమిటంటే.?

సర్కస్‌ ట్రైనర్‌పై సింహాల మెరుపు దాడి.. గగుర్పొడిచే దృశ్యాలు.. వైరల్ వీడియో.!