Gyanvapi Mosque Shivling: జ్ఞాన్​వాపి మసీదులో దొరికిన శివలింగం 12 జోతిర్లింగాలలో ఒకటి: VHP

Gyanvapi Mosque Shivling: ఉత్తర్‌ ప్రదేశ్‌ వారణాసిలోని జ్ఞాన్​వాపి మసీదులో దొరికిన శివలింగం 12 జోతిర్లింగాలలో ఒకటని విశ్వహిందు పరిషత్‌ (VSP) పేర్కొంది. వీహెచ్‌పీ చీఫ్‌ అలోక్‌ కుమార్‌ ..

Gyanvapi Mosque Shivling: జ్ఞాన్​వాపి మసీదులో దొరికిన శివలింగం 12 జోతిర్లింగాలలో ఒకటి: VHP
Follow us
Subhash Goud

|

Updated on: May 21, 2022 | 4:20 PM

Gyanvapi Mosque Shivling: ఉత్తర్‌ ప్రదేశ్‌ వారణాసిలోని జ్ఞాన్​వాపి మసీదులో దొరికిన శివలింగం 12 జోతిర్లింగాలలో ఒకటని విశ్వహిందు పరిషత్‌ (VSP) పేర్కొంది. వీహెచ్‌పీ చీఫ్‌ అలోక్‌ కుమార్‌ (VHP Chief Alok Kumar) శుక్రవారం జ్ఞానవాపి మసీదు కేసులో సుప్రీం కోర్టు ఆదేశాలతో ఏకీభవించారు. 12 జోతిర్లింగాలలో శివలింగం ఒకటని హిందూ పక్షం నిరూపించగలదని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. విచారణను వారణాసి జిల్లా కోర్టుకు బదిలీ చేస్తూ భారత సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. జిల్లా కోర్టులో సీనియర్‌, అనుభవజ్ఞుడైన న్యాయమూర్తి ఉన్నారని తెలిపింది. న్యాయమూర్తులు డివై చంద్రచూడ్, సూర్యకాంత్, పిఎస్ నరసింహలతో కూడిన ధర్మాసనం ఉత్తరప్రదేశ్ హయ్యర్ జ్యుడీషియల్ సర్వీస్‌కు చెందిన సీనియర్, అనుభవజ్ఞులైన జ్యుడిషియల్ అధికారి ఈ కేసును పరిశీలించాలని ఆదేశించింది.

12 జోతిర్లింగాలలో ఇది ఒకటి:

12 జ్యోతిర్లింగాలలో ఇది అసలైన జ్యోతిలింగాలలో ఒకటి అని వీహెచ్‌ చీఫ్‌ అన్నారు. జ్ఞానవాపి మసీదు సముదాయం వాజు ఖానా అపవిత్రమైన పాతకాలపు శిధిలాల మీద నిర్మించబడింది. మొఘలులు ఆక్రమించిన ఆలయం.. మేము దానిని కోర్టులో నిరూపించగలము.. ఈ కేసుపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంటుంది. స్థానిక కమిషనర్ నివేదికను తీసుకునే అధికారం న్యాయమూర్తికి ఉంది.. ఇది అసలు జ్యోతిర్లింగమని మేము నిరూపిస్తాము అని వీహెచ్‌ చీఫ్‌ అన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి