ఎస్ బ్యాంక్ సంక్షోభం.. రూ. 4,300 కోట్ల స్కామ్.. రానా ‘రాజ్యం’లో డొల్ల సంస్థలు

ఎస్ బ్యాంక్ ఫౌండర్ రానా కపూర్ ఇంట్లో నిర్విరామంగా సోదాలు జరిపిన ఈడీ అధికారులకు షాకింగ్ వాస్తవాలు తెలిశాయి. ఈ బ్యాంకుకు సంబంధించి మొత్తం రూ. 4,300 కోట్ల స్కామ్ జరిగిందని తేల్చినవారు.. వరుసగా రెండు రోజులపాటు ముంబైలోని ఇతని నివాసంలో జరిపిన తనిఖీల్లో..

ఎస్ బ్యాంక్ సంక్షోభం.. రూ. 4,300 కోట్ల స్కామ్.. రానా 'రాజ్యం'లో డొల్ల సంస్థలు
Follow us

| Edited By:

Updated on: Mar 08, 2020 | 5:43 PM

ఎస్ బ్యాంక్ ఫౌండర్ రానా కపూర్ ఇంట్లో నిర్విరామంగా సోదాలు జరిపిన ఈడీ అధికారులకు షాకింగ్ వాస్తవాలు తెలిశాయి. ఈ బ్యాంకుకు సంబంధించి మొత్తం రూ. 4,300 కోట్ల స్కామ్ జరిగిందని తేల్చినవారు.. వరుసగా రెండు రోజులపాటు ముంబైలోని ఇతని నివాసంలో జరిపిన తనిఖీల్లో.. సుమారు రెండు వేల కోట్ల పెట్టుబడులు గోల్ మాల్ అయ్యాయని గుర్తించారు. పైగా కపూర్ కుటుంబం డజనుకు పైగా డొల్ల (ఆషామాషీ) కంపెనీలు పెట్టి అక్రమంగా కోట్లాది విలువైన ఆస్తులు సంపాదించిందని వెల్లడైంది. (మనీ లాండరింగ్ ఆరోపణలపై రానాను అరెస్టు చేశారు). ఇతని ఇంట్లో అత్యంత ఖరీదైన 44 పెయింటింగులను అధికారులు కనుగొన్నారు. అలాగే లండన్ లో ఇతని కుటుంబం సంపాదించిన ఆస్తుల తాలూకు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. రానా కపూర్, అతని భార్య బిందు, ముగ్గురు కూతుళ్లు… అక్రమాల పుట్టగా పేరుబడిన దేవన్ హౌసింగ్ ఫైనాన్స్ సంస్థతో లింక్ పెట్టుకుని రూ. 600 కోట్ల సొమ్మును అందుకున్నారట. ‘డూ ఇట్ అర్బన్ వెంచర్స్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్’ అనే ఫేక్ కంపెనీ పేరిట రానా కపూర్ పాల్పడిన అవకతవకలు బయటపడ్డాయి. దేవన్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీకి ఎస్ బ్యాంకు ద్వారా రూ.3 వేల కోట్ల రుణాలు ఇఛ్చినట్టే ఇఛ్చి.. అందుకు ప్రతిఫలంగా అక్రమ ఆస్తులను సంపాదించారని తెలిసింది. నిధుల డైవర్షన్, ఆర్ధిక లావాదేవీల అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడడంతో ఈడీ అధికారులే ఖంగు తిన్నారు. తాము అందుకున్న ముడుపులు రొటేట్ చేసుకునేందుకు డజనుకు పైగా డమ్మీ కంపెనీలను ఈ కుటుంబం ఏర్పాటు చేసుకుందని, కొంతమంది రాజకీయ నేతలను మఛ్చిక చేసుకోవడానికి అనువుగా వారి నుంచి 44  ఖరీదైన పెయింటింగులను కొనుగోలు చేసిందని ఈడీ అధికారులు తెలిపారు.

20 గంటల విచారణ అనంతరం.. 62 ఏళ్ళ రానా కపూర్ ని ఈడీ సిబ్బంది ముంబైలోని బలార్ద్ ఎస్టేట్ లో అరెస్టు చేశారు. ఆయనను కోర్టులో ప్రవేశపెట్టనున్నారు.

Latest Articles
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
ఏంటి..! నభా నటేష్‌కు ఇంకా గాయం మానలేదా..
ఏంటి..! నభా నటేష్‌కు ఇంకా గాయం మానలేదా..